NTV Telugu Site icon

Adipurush Preview: ‘ఆదిపురుష్’ మూవీ ప్రివ్యూ.

Adipurush Movie Preview

Adipurush Movie Preview

Adipurush Movie Preview: ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే హడావుడి, ఆదిపురుష్, ఆదిపురుష్, ఆదిపురుష్. ఆదిపురుష్ టిక్కెట్ ఒక్కటన్నా ఇప్పించండి అనే ఫోన్లు మొదలయ్యాయి. నిజానికి రెబల్ స్టార్ ప్రభాస్‌ను వెండి తెరపై శ్రీ రాముడిగా చేసేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నారు సినీ అభిమానులు. నిజానికి ఆదిపురుష్‌ టీజర్‌లో గ్రాఫిక్స్ చూసిన తర్వాత సినిమా మీద అందరిలో అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలో సినిమాను ఆరు నెలలు పోస్ట్‌పోన్ చేసి దాన్ని నగిషీలా చెక్కి ట్రైలర్ రిలీజ్ చేసి అదిరిపోయే పాజిటీవిటీని సొంతం చేసుకున్నాడు డైరెక్టర్ ఓం రౌత్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – ఓం రౌత్ కాంబోలో తెరకెక్కిన ‘ఆదిపురుష్’లో ఆయన రాముడిగా.. సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా, కృతి సనన్ సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, దేవదత్త నాగే హనుమంతుడిగా నటించారు. ఈ సినిమాను టీ సిరీస్, రెట్రో ఫైల్స్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌, ఓం రౌత్లు నిర్మించారు. అజయ్ – అతుల్ ద్వయం ఆదిపురుష్ సినిమాకు సంగీతం అందించారు.

Adipurush Benefit Show: ఆదిపురుష్ మొదటి బెనిఫిట్ షో ఎక్కడో తెలుసా?

నిజానికి ‘ఆదిపురుష్’ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే అంచనాలు ఓ రేంజ్‌లో మొదలయ్యాయి. అందుకు అనుగుణంగానే సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా దానికి భారీ స్పందన లభిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనేలా సినిమాను విడుదల చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, హిందీ భాషల్లో 550 కోట్ల రూపాయల బడ్జెట్ వెచ్చించి తెరకెక్కించగా తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో దబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో కంప్యూటర్ గ్రాఫిక్స్ తో తెరకెక్కించిన ఈ సినిమా మీద అంచనాలు సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ ఎక్కువ అవుతూనే ఉన్నాయి. నిజానికి టీజర్ రిలీజ్ అయినప్పుడు గ్రాఫిక్స్ విషయంలో ఏర్పడిన నెగిటివ్ టాక్ ను జై శ్రీరామ్ సాంగ్ పాజిటివ్‌గా మార్చింది. ఇక రెండు సందర్భాల్లో రిలీజ్ అయిన రెండు ట్రైలర్స్ సినిమా పై అంచనాలను మరో రేంజ్ లో పెంచేశాయి.

Adipurush: మోస్ట్‌ ట్రోల్డ్‌ సినిమా నుండి మోస్ట్ అవైటెడ్‌ సినిమా వరకు.. ఆదిపురుష్‌ సక్సెస్‌

సాంగ్స్‌కు కూడా ఊహించని స్పందన వస్తోంది. నార్త్ లో అయితే ఏకంగా ఈ పాటలతో భజనలు చేస్తున్నారు. మొత్తంగా ఆదిపురుష్ రన్ టైం అనుకున్న దానికంటే ఎక్కువగానే ఉంది. ఈ సినిమా 179 నిమిషాల రన్‌ టైమ్‌ను లాక్ చేసుకుందని సెన్సార్ సర్టిఫికేట్ తేల్చేసింది. అంటే ఒక నిమిషం తక్కువ మూడు గంటల నిడివితో ఆదిపురుష్ థియేటర్లోకి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ లెక్కన ఆదిపురుష్‌ని థియేటర్లో చూడాలంటే మూడున్నర గంటలకు పైగా సమయం కేటాయించాల్సిందే. సీతాదేవి, శ్రీ రాముడు, లక్ష్మణుడు వనవాసం పయనం అయ్యే దగ్గర ఆదిపురుష్ సినిమా మొదలై… సూర్ఫణఖ వచ్చి చెవులు ముక్కు కోపించుకోని వెళ్లే దగ్గర నుంచి మరో లెవల్ కు తీసుకు వెళ్లనుంది. ఆ తర్వాత రావణుడు సీతాదేవిని అపహరించి తీసుకోని వెళ్లడం, హనుమంతుడు-రాముడి పరిచయం, సముద్రంపై వంతెన నిర్మించడం, లంకా దహనం, అంతిమ యుద్ధం, సీతాదేవి రాముల వారు తిరిగి అయోధ్య చేరడంతో ఆదిపురుష్ సినిమా ముగుస్తుందని టాక్. అయితే రామాయణం మొత్తం తీసుకోకుండా ఓం రౌత్ తెలివిగా దుష్ట శిక్షణ ఎపిసోడ్ ను హైలైట్ చేయబోతున్నారు.

Adipurush Theaters Count: ప్రపంచవ్యాప్తంగా 7000 థియేటర్లలో ఆదిపురుష్..ఎక్కడెక్కడ ఎన్నంటే?

ఇక ఈ సినిమా క్రేజ్ మాత్రం మెంటల్ ఎక్కిస్తోంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ తర్వాత మళ్లీ ఇప్పుడే ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ సినిమా టికెట్స్ ఓపెన్ చేసిన కొన్ని గంటలకే హాట్ కేకుల్లా అమ్ముడయిపోయాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాతో పాటు అన్ని ఆన్‌లైన్ యాప్స్‌లోనూ టికెట్స్ కోసం తంటాలు పడుతున్నా దొరకక పోవడంతో తెలిసిన వాళ్లను టికెట్ ఇప్పించగలిగే వాళ్లని కాక పడుతున్నారు. ఎన్ని వేల థియేటర్స్‌లో సినిమా విడుదలైనా టికెట్స్ మాత్రం దొరకం లేదు. రేటు ఎంత ఎక్కువ పెట్టినా ఆదిపురుష్ క్రేజ్ ముందు అన్నీ దిగదుడుపే అన్నట్టు క్షణాల్లో అమ్ముడు అవుతున్నాయి. నిజానికి అనాధ పిల్లలకు చూపిస్తాం టికెట్ రేటు పెట్టలేని వాళ్ల కోసం అని చెబుతూ గంపగుత్తగా కొందరు ఆదిపురుష్ టికెట్స్ కొన్నారు. ఈ క్రమంలో కామన్ పీపుల్‌కు టికెట్స్ దొరకడం లేదు. అయితేనేం టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఆదిపురుష్ సినిమా చూసే దాకా తగ్గేది లేదని అంటున్నారు సినీ ప్రేమికులు.