NTV Telugu Site icon

Prabhas: దయచేసి ఆ పని చేయకు డార్లింగ్.. సలార్ కు ఎఫెక్ట్ అవుతుంది.. ?

Prabhas

Prabhas

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న చిత్రం సలార్. ఈ సినిమాపై అభిమానులు ఏ రేంజ్ లో అంచనాలను పెట్టుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎన్నో వాయిదాల తరువాత ఈ సినిమా డిసెంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రభాస్ ఒక భారీ హిట్ కోసం ఎన్నో ఏళ్లగా ఎదురుచూస్తున్నాడు. రాధే శ్యామ్ నుంచి ఆదిపురుష్ వరకు డార్లింగ్ హిట్ అందుకున్నది లేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్.. సలార్ పైనే ఆశలు పెట్టుకున్నారు. సినిమా మొదటిరోజు పాజిటివ్ టాక్ వస్తే చాలు.. దాన్ని కొట్టేవారు ఉండరు. అలా రావాలి అంటే ప్రమోషన్స్ గట్టిగా చేయాలి.

Nani: తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు.. నాని ఏమన్నాడంటే.. ?

పాన్ ఇండియా సినిమా అంటే.. అసలు ఇప్పుడున్న హీరోలు ఏ రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తున్నారో అందరికి తెల్సిందే. నిమిషం కూడా ఖాళి లేకుండా సినిమా మీద హైప్స్ పెంచేస్తున్నారు. కానీ ప్రభాస్ సినిమా విషయంలో ఒకరు పెంచాల్సిన అవసరం ఉండదు. అయితే అందుకు తగ్గట్టుగా ప్రమోషన్స్ మాత్రం ఖచ్చితంగా చేయాలి. కానీ, ఈసారి కూడా ప్రభాస్ ప్రమోషన్స్ లో పాల్గొనే ఛాన్స్ లేదని తెలుస్తోంది. ఆదిపురుష్ సినిమా సమయంలో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న ప్రభాస్.. తరువాత విదేశాలకు వెళ్ళిపోయాడు. సినిమా రిలీజ్ అయ్యాక ఎప్పుడో ఇండియా వచ్చాడు. ఇప్పుడు సలార్ ప్రమోషన్స్ లో కూడా అదే రిపీట్ అవుతుంది అని సమాచారం. సలార్ ఒకటి రెండు ఈవెంట్స్ లో కనిపించి.. ప్రభాస్ ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లల్లో మాత్రం కనిపించడని అంటున్నారు. ఇదే కనుక నిజమైతే సినిమాపై భారీ ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. అందుకే అభిమానులు దయచేసి ఆ పని చేయకు డార్లింగ్.. సలార్ కు ఎఫెక్ట్ అవుతుంది అంటూ చెప్పుకొస్తున్నారు. మరి ప్రభాస్.. ఏం చేస్తాడో చూడాలి.

Show comments