NTV Telugu Site icon

Prabhas: ప్రభాస్, హృతిక్ కాంబో కన్ఫమ్.. కానీ ఓ చిన్న మెలిక?

Prabhas Hrithik Film

Prabhas Hrithik Film

Prabhas Hrithik Roshan To Share Screen In Siddharth Anand Directorial Movie: బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్‌తో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఓ సినిమా చేయనున్నాడని చాలాకాలం నుంచే ప్రచారం జరుగుతూ వస్తోంది. ఇది నిజమేనంటూ.. ఇటీవల మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ క్లారిటీ ఇచ్చేసింది. ప్రభాస్, సిద్ధార్థ్ కాంబోలో ఓ సినిమా ఉండనుందని.. ఇది ఔట్ అండ్ ఔట్ యాక్షన్ సినిమా అని ఆ సంస్థ క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి మరో ఆసక్తికరమైన అప్డేట్ వెలుగులోకి వచ్చింది. ఇందులో హృతిక్ రోషన్ కూడా కనిపించనున్నాడని సమాచారం. కాకపోతే.. అతనిది ఫుల్ లెంగ్త్ పాత్ర కాదు. కేవలం కేమియో మాత్రమే ఉంటుందని తెలిసింది. ఆల్రెడీ ఈ విషయంపై హృతిక్‌తో సిద్ధార్థ్ మాట్లాడాడని, అందుకు అతడు సుముఖత వ్యక్తం చేశాడని తెలుస్తోంది. ప్రభాస్ కూడా హృతిక్‌తో కలిసి వెండితెర పంచుకోవడానికి చాలా ఆసక్తి కనబరిచాడని టాక్.

Air India: విమానంలో మరో మూత్ర విసర్జన ఘటన.. ఎయిరిండియాకు రూ.10లక్షల జరిమానా

అయితే.. ప్రభాస్, హృతిక్ కాంబోపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఇది నిజమే అయితే మాత్రం.. సినిమా లవర్స్‌కి పండగే. వారి కటౌట్‌లకు వెండితెరపై చూడటం ఒక ప్రత్యేక కిక్ ఇస్తుందని చెప్పుకోవడంలో సందేహమే లేదు. కాగా.. హృతిక్‌తో సిద్ధార్థ్ ఇదివరకే బ్యాంగ్ బ్యాంగ్, వార్ సినిమాలు చేశాడు. ప్రస్తుతం అతడు షారుఖ్ ఖాన్‌తో చేసిన ‘పఠాన్’ సినిమా జనవరి 25న రానుంది. ఈ సినిమా తర్వాత అతడు మరోసారి ‘ఫైటర్’ కోసం హృతిక్‌తో జోడీ కట్టనున్నాడు. ఈ సినిమా తీశాకే.. ప్రభాస్ సినిమా సెట్స్ మీదకి వెళ్లే అవకాశం ఉంది. ఆలోపు తన చేతిలో ఉన్న ప్రాజెక్టులను ప్రభాస్ కంప్లీట్ చేసుకోవచ్చు. ప్రభాస్, హృతిక్ కాంబో సెట్ అయితే మాత్రం.. అది వరల్డ్‌వైడ్‌గా చమత్కారం సృష్టించడం ఖాయమని చెప్పుకోవచ్చు.

Thalapathy Vijay: విడాకులకు సిద్ధమైన విజయ్.. కారణం కీర్తి సురేశ్?

Show comments