Site icon NTV Telugu

Prabhas: రెబల్ స్టార్ సినిమాలో నటిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా?

Prabhas

Prabhas

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక హీరోయిన్ స్లిలౌట్ ఫోటో వైరల్ అవుతోంది. మేఘాలని చూస్తూ, కురులని గాలికి వదిలేసి, షార్ట్స్ లో వండర్ విమెన్ లా నిలబడిన ఈ హీరోయిన్ ఎవరా అంటూ నెటిజన్స్ ఫోటోని షేర్ చేస్తున్నారు. నేచర్ ని ఆస్వాదిస్తున్న ఈ హీరోయిన్, ప్రభాస్-మారుతీ కలిసి చేస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న ‘మాళవిక మోహనన్’ది. దళపతి విజయ్ నటించిన మాస్టర్ సినిమాతో తెలుగు ఆడియన్స్ ముందుకి వచ్చిన మలయాళ బ్యూటీ ‘మాళవిక మోహనన్’కి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఎప్పటికప్పుడు కొత్త ఫొటోస్ ని పోస్ట్ చేస్తూ గ్లామర్ ట్రీట్ ఇవ్వడంలో మాళవిక దిట్ట. ప్రభాస్-మారుతీ సినిమానే మాళవికకి మొదటి స్ట్రెయిట్ తెలుగు సినిమా, ఈ మూవీ హిట్ అయితే స్టార్ హీరోయిన్ అయ్యే లక్షణాలు మాళవికకి కావాల్సినన్ని ఉన్నాయి. మాళవిక తమిళ్ లో ప్రస్తుతం చియాన్ విక్రమ్ తో తంగళాన్ సినిమాలో నటిస్తోంది.

పా రంజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై కోలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో జరిగే పీరియాడిక్ కథతో తంగళాన్ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా సెట్స్ నుంచే మాళవిక మోహనన్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మాస్టర్ సినిమా ఫ్లాప్ అయ్యింది, ఆ తర్వాత ధనుష్ తో కలిసి నటించిన మారన్ సినిమా కూడా మాళవికకి కోలీవుడ్ లో హిట్ ఇవ్వలేకపోయింది. ఇలాంటి సమయంలో మాళవిక మోహనన్ తమిళ ఇండస్ట్రీలో నిలబడాలి అంటే తంగళాన్ సినిమా సూపర్ హిట్ అవ్వాలి, తెలుగులో ప్రభాస్-మారుతీ సినిమా సాలిడ్ హిట్ అవ్వాలి. అప్పుడే ఈ మలయాళ బ్యూటీకి సౌత్ ఇండస్ట్రీ మొత్తం అవకాశాలు దొరుకుతాయి లేదంటే మాళవిక మలయాళ సినిమాలు చేస్తూ ఉండిపోవాల్సిందే.

Exit mobile version