NTV Telugu Site icon

Prabhas: మోకాలి సర్జరీ పూర్తి.. డైనోసర్ ఇండియా వచ్చేది ఎప్పుడంటే.. ?

Prabhas

Prabhas

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఈ ఏడాది ఆదిపురుష్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ మెప్పించలేకపోయాడు. ఇక దీంతో అందరి చూపు అతని నెక్స్ట్ సినిమాలపైనే ఉంది. ముఖ్యంగా సలార్ పైనే ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా ఇప్పుడప్పుడే వచ్చేటట్టు కనిపించలేదు. అందుతున్న సమాచారం ప్రకారం డిసెంబర్ 22 న సలార్ వస్తుందని తెలుస్తోంది. కానీ, ఇప్పటివరకు మేకర్స్ అధికారికంగా ప్రకటించింది లేదు. ఇక ఇంకోపక్క ప్రభాస్.. విదేశాల్లో ఉన్నాడు. ఈ మధ్యనే మోకాలి సర్జరీ కోసం ప్రభాస్ అమెరికాకు వెళ్లిన సంగతి తెల్సిందే. ఇక రెండు రోజుల క్రితమే డార్లింగ్ సర్జరీ విజయవంతంగా పూర్తయ్యింది అని సమాచారం.

Swathi-Saidharam Tej: మెగాహీరోకి స్టేజీపై ముద్దుపెట్టిన కలర్స్ స్వాతి.. వైరల్ అవుతున్న ఫోటో..

ప్రస్తుతం ప్రభాస్.. అక్కడే రెస్ట్ తీసుకుంటున్నాడు. ఈ నెల మొత్తం ప్రభాస్ అక్కడే ఉండనున్నారు. తన సినిమాలకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు మేకర్స్ ద్వారా తెలుసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక నవంబర్ లో ప్రభాస్ ఇండియాకు రానున్నాడు. సలార్ సినిమాను ఇప్పటికే ఫినిష్ చేసిన ప్రభాస్ .. కల్కి, మారుతీ సినిమాను సెట్ లో అడుగుపెట్టనున్నాడు. వీటిని పూర్తి చేస్తూనే ఇంకోపక్క సలార్ ప్రమోషన్స్ పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలియడంతో ప్రభాస్ ఫ్యాన్స్.. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. మరి ఈ సినిమాతో ప్రభాస్ ఎలాంటి రికార్డులు కొల్లగొడతాడో చూడాలి.

Show comments