రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ లైనప్‌లో మోస్ట్ యాంటిసిపేటెడ్ చిత్రంగా నిలిచింది ‘ఫౌజీ’. హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చారిత్రక యుద్ధ నేపథ్య చిత్రంపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతుంది. ఆయితే ఈ సినిమాకు సంబంధించిన బడ్జెట్ మరియు విజువల్స్ గురించి ఓ న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ దాదాపు రూ. 500 నుండి 600 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. స్వాతంత్ర్యానికి పూర్వపు రోజులను కళ్లకు కట్టేలా చూపించేందుకు భారీ సెట్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ విజువల్ ఎఫెక్ట్స్ ను వాడుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా విజువల్ ట్రీట్ బాలీవుడ్‌లో ఇప్పటివరకు వచ్చిన బిగ్గెస్ట్ హిస్టారికల్ మరియు పీరియడ్ డ్రామాల గ్రాండియర్‌ను సైతం తలదన్నేలా ఉండబోతుందని సమాచారం. కేవలం యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రమే కాకుండా, హను రాఘవపూడి మార్క్ ఎమోషన్, అద్భుతమైన ప్రేమకథ కూడా ఈ చిత్రంలో హైలైట్‌గా నిలవనున్నాయి. ప్రభాస్ లుక్, క్యారెక్టరైజేషన్ ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేయబోతుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ బడా చిత్రాలకు దీటుగా టాలీవుడ్ నుండి వస్తున్న ఈ విజువల్ వండర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించబోతుందో చూడాలి.

