Site icon NTV Telugu

Fauji: దసరాకి ‘ఫౌజీ’ గ్రాండ్ రిలీజ్

Prabhas Fauji Prequel

Prabhas Fauji Prequel

రెబెల్ స్టార్ ప్రభాస్, హను రాఘవపూడి దర్శకత్వంలో చేస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘ఫౌజీ’. సక్సెస్ ఫుల్ పాన్-ఇండియా బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో టి-సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలై ఫస్ట్ లుక్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇక దసరా పండుగ సందర్భంగా ‘ఫౌజీ’ గ్రాండ్‌గా రిలీజ్ కానుందని మేకర్స్ హింట్ ఇచ్చారు. ఇక షూటింగ్ పూర్తయ్యే వరకు ఎలాంటి విరామం లేకుండా కంటిన్యూ షెడ్యూల్ కొనసాగనుందని తెలుస్తోంది. అత్యంత గ్రాండ్‌గా రూపుదిద్దుకుంటోన్న ఈ ‘ఫౌజీ’ విజువల్ వండర్ గా ఉండబోతోంది.

Also Read:Team India Coach: రవిశాస్త్రి రీఎంట్రీ.. కానీ ఓ కండిషన్?

ఎమోషన్‌, గ్రాండ్యూర్‌కి పేరుపొందిన దర్శకుడు హను రాఘవపూడి, ప్రభాస్‌ని ఇంతకు ముందు ఎప్పుడూ చూడని పవర్ ఫుల్ అవతార్ లో చూపించబోతున్నారు. ప్రభాస్ సరసన హీరోయిన్‌గా ఇమాన్వీ నటిస్తోంది. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద, భాను చందర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ లు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై వరల్డ్ క్లాస్ ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీమ్ పనిచేస్తోంది. సినిమాటోగ్రఫీని సుదీప్ చటర్జీ (ISC) నిర్వహిస్తుండగా, సంగీతాన్ని విషాల్ చంద్రశేఖర్ అందిస్తున్నారు. అనిల్ విలాస్ జాధవ్ ప్రొడక్షన్ డిజైనర్, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో విడుదల కానుంది.

Exit mobile version