Imanvi Ismail: ప్రభాస్ హీరోయిన్ ఇమాన్వికి మరో ఛాన్స్ ఎందుకు రాలేదు?.. ‘ఫౌజీ’ వెనుక ఇదే కారణమా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Imanvi Ismail: స్టార్ హీరో సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెడితే వరుస అవకాశాలు రావడం మామూలే. ముఖ్యంగా ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్ సరసన తొలి సినిమా చేసే హీరోయిన్లపై దర్శక నిర్మాతల దృష్టి ఎక్కువగా ఉంటుంది. అయితే ఈసారి పరిస్థితి కాస్త భిన్నంగా కనిపిస్తోంది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్న ఇమాన్వి ఇస్మాయిల్ గురించి ఇప్పుడు చర్చ అయితే సాగుతోంది. సినిమా ప్రారంభమైనప్పటి నుంచి ఆమెపై మంచి అంచనాలు ఉన్నప్పటికీ, ఇప్పటివరకు మరో ప్రాజెక్ట్‌ను ప్రకటించకపోవడం ఆసక్తిగా మారింది. ‘ఫౌజీ’లో ప్రభాస్ సరసన నటించే అవకాశం రావడంతో ఇమాన్వి ఇస్మాయిల్ పేరు ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. కొత్త హీరోయిన్ అయినప్పటికీ, స్టార్ హీరోతో తొలి సినిమా కావడంతో ఆమెకు వరుస అవకాశాలు వస్తాయని చాలామంది భావించారు. కానీ సినిమా షూటింగ్ పలుమార్లు ఆలస్యం కావడంతో ఆ అంచనాలు కొంత తగ్గినట్లు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఆమె మరో తెలుగు చిత్రానికి సంతకం చేసినట్లు కనిపించలేదు.
ఇదిలా ఉండగా, ఇండస్ట్రీలో మరో ప్రచారం కూడా వినిపిస్తోంది. ‘ఫౌజీ’ విడుదలయ్యే వరకు ఇమాన్వి ఇతర తెలుగు సినిమాలకు సంతకం చేయకూడదనే నిబంధనతో నిర్మాతలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం తర్వాత ఇమాన్వి పెద్దగా పబ్లిక్ ఈవెంట్లలో కూడా కనిపించలేదు. ఆమె కొత్త ప్రాజెక్ట్‌లపై చర్చలు జరుపుతున్నారనే సమాచారం కూడా ఇప్పటివరకు బయటకు రాలేదు. దీంతో ఆమె పూర్తిగా ‘ఫౌజీ’ చిత్రంపైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇక ‘ఫౌజీ’ సినిమా విషయానికి వస్తే, షూటింగ్ లో ఇంకా కీలక భాగాలు మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ ఆగస్టు నెలలో మళ్లీ షూటింగ్లో పాల్గొనే అవకాశం ఉంది. అదే సమయంలో సినిమా విడుదల తేదీకి సంబంధించిన ఆఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చే అవకాశం ఉంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే విడుదల తేదీతో పాటు ఓ చిన్న గ్లింప్స్‌ను కూడా అభిమానుల ముందుకు తీసుకురావచ్చని టాక్ నడుస్తోంది.
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
- Tags
- cinema
- Imanvi Ismail
తాజావార్తలు
-
LPG Cylinder Price Hike: పండుగ సీజన్‌కు ముందు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ల ధరలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!