NTV Telugu Site icon

Salaar Teaser: ఏయ్.. బాబు.. త్వరగా పడుకోవాలి.. పొద్దునే లేవాలి కదా

Prabhas

Prabhas

Salaar Teaser: ప్రభాస్ ఫ్యాన్స్ ప్రస్తుతం త్వరగా పడుకోవడానికి సిద్ధమవుతున్నారు. 3 గంటల వరకు సోషల్ మీడియాలో ఉండేవారు కూడా ఈరోజు 11 గంటలకే దుప్పటి ముసుగేస్తున్నారు. అయ్యా.. దేనికి.. అంత హడావిడి అనుకుంటున్నారా.. ? రేపు జూలై 6.. అంటే సలార్ టీజర్ వచ్చేరోజు అన్నమాట. అందుకే డార్లింగ్ ఫ్యాన్స్ అందరు త్వరగా పడక ఎక్కేస్తున్నారు. ఎందుకు అంత త్వరగా.. లేచాకనే కదా రిలీజ్ అనుకుంటే పొరబాటే.. సలార్ టీజర్ రేపు ఉదయం 5 గంటల 12 నిమిషాలకు రిలీజ్ కానుంది. మరి రిలీజ్ అయిన వెంటనే టీజర్ ను ఓ రేంజ్ లో వైరల్ చెయ్యాలి.. ట్రెండ్ చేయాలి.. అలా చేయకపోతే ఫ్యాన్స్ ఎందుకు . అందుకే ఎలాగైనా ఈరోజు త్వరగా పడుకొని ఉదయాన్నే లేవాలని డార్లింగ్ ఫ్యాన్స్ నిర్ణయించుకున్నారు. ఇక ఈ నిద్ర గురించి సోషల్ మీడియాలో మీమ్స్ కూడా వేసేస్తున్నారు. ఏయ్.. బాబు.. త్వరగా పడుకోవాలి.. పొద్దునే లేవాలి కదా అంటూ సినిమా డైలాగ్స్ తో మీమ్స్ వేసి మరి డార్లింగ్ ఫ్యాన్స్ ను నిద్రపుచ్చుతున్నారు. ఇక ప్రభాస్ డై హార్ట్ ఫ్యాన్స్ అయితే కావాలంటే జాగారం అయినా చేస్తాం కానీ, నిద్రపోయే ప్రసక్తే లేదని ఫోన్లకు అతుక్కుపోయారు.

Allu Arjun: అల్లు అర్జున్ మార్ఫింగ్ ఫోటో.. ఛీ.. ఇంత దారుణమా

ఆదిపురుష్ పరాజయంతో ప్రభాస్ ఫ్యాన్స్ కొద్దిగా నిరాశలో ఉన్న విషయం తెల్సిందే. ఇక వారి ఆశలన్నీ ప్రస్తుతం సలార్ మీదనే ఉన్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు, కెజిఎఫ్ 2 కు కనెక్షన్ ఉందని చెప్పి మరింత హైప్ తెచ్చేసుకున్నారు ఫ్యాన్స్. ఇక ఈ సినిమాలో ప్రభాస్ లుక్ ఊర మాస్ గా ఉంటుందని తెలిసినప్పటి నుంచి డార్లింగ్ ఫ్యాన్స్ కు అసలు కంటిమీద కునుకే పట్టడం లేదు. అలాంటింది టీజర్ వస్తుంది అంటే ఎలా నిద్రపోతారు. ఆ మాత్రం లేకపోతే వాళ్లు డార్లింగ్ ఫ్యాన్స్ ఎలా అనిపించుకుంటారు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరి రేపు టీజర్ రచ్చ ఎలా ఉండబోతుంది అనేది చూడాలనుంటే ఇంకొన్ని గంటలు ఎదురుచూడాల్సిందే.

Show comments