NTV Telugu Site icon

Prabhas: రీరిలీజ్ కి రెడీ… మాస్ థియేటర్స్ దద్దరిల్లుతాయి

Prabhas

Prabhas

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా ఫేజ్ ని స్టార్ట్ చేసారు రాజమౌళి, ప్రభాస్. బాహుబలి సీరీస్ ప్రభాస్ ని ఈ జనరేషన్ చూసిన ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ గా మార్చింది. మోస్ట్ సక్సస్ ఫుల్ కాంబినేషన్ గా పేరున్న ప్రభాస్-రాజమౌళి ప్రయాణం మొదలయ్యింది ఛత్రపతి సినిమాతో… ఒక ప్రాపర్ కమర్షియల్ మాస్ సినిమాగా రూపొందిన ఛత్రపతి సినిమా హీరోయిజంకి ఒక కొత్త బెంచ్ మార్క్ లా నిలిచింది. ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్, డైలాగ్స్, ఎలివేషన్ సీన్స్ కి మాస్ ఆడియన్స్ పూనకాలు వచ్చినట్లు ఊగిపోయారు.  ప్రభాస్ ని పర్ఫెక్ట్ మాస్ కటౌట్ గా చూపిస్తూ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఛత్రపతి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. సింపుల్ గా చెప్పాలి అంటే ప్రభాస్-రాజమౌళిల బాహుబలికి పునాది వేసింది ఛత్రపతి.2005లో వచ్చిన ఈ మూవీ ఇప్పుడు రీరిలీజ్ కి రెడీ అయ్యింది.

అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే కావడంతో ఛత్రపతి సినిమా తెలుగు రాష్ట్రాల్లో రీరిలీజ్ అవ్వనుంది. కొన్ని నెలల క్రితమే యోగి సినిమాతో రీరిలీజ్ ని ఎంజాయ్ చేసిన ప్రభాస్ ఫ్యాన్స్… ఇప్పుడు సూపర్ హిట్ ఛత్రపతి సినిమాతో థియేటర్స్ లో రచ్చ చేయనున్నారు. ప్రభాస్ బర్త్ డేని ఛత్రపతి సినిమా చూసి థియేటర్స్ దగ్గర హంగామా చేయడం గ్యారెంటీ. ప్రభాస్ అభిమానుల జోష్ ని మరింత పెంచుతూ సలార్, కల్కి, స్పిరిట్, మారుతీ సినిమాల నుంచి పోస్టర్స్ బయటకి రానున్నాయి. నిజానికి ఈ టైమ్ కి సలార్ ట్రైలర్ బయటకి రావాలి కానీ సినిమా రిలీజ్ కి ఇంకా సమయం ఉంది కాబట్టి ఇప్పుడే ట్రైలర్ ని రిలీజ్ చేసే అవకాశం కనిపించట్లేదు.