Site icon NTV Telugu

ప్రభాస్ ఫ్యాన్ సూసైడ్ నోట్… యూవీ క్రియేషన్స్ కు కొత్త తలనొప్పి

prabhas

prabhas

యూవీ క్రియేషన్స్ కు కొత్త తలనొప్పి స్టార్ట్ అయ్యింది. యంగ్ రెబల్ స్టార్ అభిమాని ఒకరు సోషల్ మీడియా వేదికగా సూసైడ్ నోట్ రాస్తూ యూవీ క్రియేషన్స్ తన చావుకి కారణమని చెప్పడంతో పాటు సదరు నిర్మాణ సంస్థను, ప్రభాస్ ను ట్యాగ్ చేశాడు. “ఈ లెటర్ రాసింది ఒక రెబెల్ స్టార్ ఫ్యాన్ అయినా కానీ ప్రతీ రెబెల్ స్టార్ ఆవేదన ఇది అని అర్ధం చేసుకోండి” అంటూ ప్రభాస్ అభిమాని ట్విట్టర్ లో పోస్ట్ చేసిన సూసైడ్ నోట్ వైరల్ అవుతోంది. అసలు ఆ సూసైడ్ నోట్ కథేంటి? యూవీ క్రియేషన్స్ వారు దానికి కారణం ఎలా అయ్యారు? ఆ లెటర్ లో ఇంతకూ ఏముంది? అంటే…

Read Also : కంగనా, కాంగ్రెస్ వార్… కేసు నమోదు

“ఇంతవరకు ఒక్క లెటర్ కూడా రాయని నేను సూసైడ్ నోట్ రాస్తానని కలలో కూడా ఊహించలేదు. మీరు అప్‌డేట్స్ ఇవ్వకపోవడం వల్ల రాయక తప్పడం లేదు. కనీసం నా చావు చూసైనా ‘రాధేశ్యామ్’ అప్‌డేట్ ఇస్తారని అనుకొంటున్నాను. చాలా రోజులు వేచి చూసేలా చేశారు. మేము వెయిట్ చేశాం. ఇక చాలు సార్. నా చావుకి కారణం యూవీ క్రియేషన్స్ టీమ్, డైరెక్టర్ రాధాకృష్ణ మాత్రమే. ఈ యూనిట్‌కు చిన్న మనవి.. ఫ్యాన్స్ ఎమోషన్స్‌తో ఆడుకోవద్దు.. ఇట్లు.. రెబెల్ స్టార్ ఫ్యాన్” అని ఆ లెటర్ లో ఉంది. “రాధేశ్యామ్” చిత్రాన్ని జనవరి 14వ తేదీన రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

అయితే సినిమా నుంచి వరుస అప్డేట్స్ ఆశిస్తున్నా అభిమానుల ఆశలు నిరాశ చేస్తూ గత వారం రోజులుగా కనీసం సినిమా నుంచి ఒక్క పోస్టర్ కూడా విడుదల అవ్వలేదు. మరోవైపు “రాధేశ్యామ్” విడుదల పోస్ట్ ఫోన్ అయ్యే అవకాశం ఉందని, అందులో ఇంకా ప్రమోషన్స్ స్టార్ట్ చేయలేదని వార్తలు వస్తున్నాయి.

Exit mobile version