Site icon NTV Telugu

Prabhas: మూడు గంటల సినిమాలో ప్రభాస్ మాట్లాడింది మూడు నిమిషాలేనా?

Salaar 2

Salaar 2

సలార్ సీజ్ ఫైర్ వరల్డ్ వైడ్‌ దాదాపు 800 కోట్ల గ్రాస్ కొల్లగొట్టి ప్రభాస్ కి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చింది. డిసెంబర్ 22న రిలీజైన ఈ మూవీ నెల రోజులు తిరగకుండానే ఓటీటీలోకి వచ్చేసింది. సంక్రాంతి సినిమాల జోష్ తగ్గి మళ్లీ సలార్ సీజ్ ఫైర్ సినిమాకి థియేటర్స్ ఇస్తారు అనే మాట వినిపిస్తున్న సమయంలో సడన్ గా సలార్ సినిమా ఓటీటీలోకి వచ్చేయడం ఆశ్చర్యం కలిగించే విషయం. నెట్ ఫ్లిక్స్ లో సలార్ సినిమా స్ట్రీమ్ అవుతోంది, దీంతో థియేటర్స్ లో మిస్ అయిన వాళ్లు… ఆల్రెడీ చూసిన వాళ్లు సలార్ ని రిపీట్ వేస్తున్నారు. కాటేరమ్మ కొడుకు వచ్చాడు అంటూ సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ వీడియోస్ తో హల్చల్ చేస్తున్నారు. థియేటర్ లో సినిమా చూసినప్పుడు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో రవి బాసూర్ KGF రేంజ్ స్కోర్ కొట్టలేదు అనే కామెంట్స్ వినిపించాయి.

ఓటీటీలో సినిమా చూసిన వాళ్లు మాత్రం రవి బసూర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది అంటున్నారు. అయితే సలార్ సినిమాని థియేటర్స్ లో చూసినప్పటి నుంచి ప్రభాస్ అభిమానుల్లో, మూవీ లవర్స్ లో ఉన్న ఏకైక డౌట్… అసలు ప్రభాస్ సినిమాలో ఎంత సేపు మాట్లాడాడు? ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో ఎక్కువ డైలాగ్స్ చెప్పించకుండా కేవలం ఆ కటౌట్ ని మాత్రమే వాడుకోని సినిమా చేసాడు. అందుకే సలార్ చూసిన వాళ్లకి ఆ డౌట్ వచ్చింది. ఇప్పుడు సలార్ ఓటీటీలోకి వచ్చేసింది కాబట్టి ప్రభాస్ డైలాగ్స్ లో విషయంలో ఒక క్లారిటీ వచ్చింది. సలార్ సినిమాలో ప్రభాస్ మొత్తం కలిపి మూడు నిముషాలు మాత్రమే డైలాగ్స్ చెప్పాడు. రెండు గంటల యాభై అయిదు నిమిషాల నిడివి ఉన్న సినిమాలో హీరో కేవలం మూడు నిముషాలు మాత్రమే మాట్లాడాడు. యావరేజ్ గా ప్రతి రెండున్నర నిమిషాలకి ప్రభాస్ ఒక డైలాగ్ చెప్పాడన్నమాట. ఈ విషయంలో మీకు కూడా క్లారిటీ రావాలంటే ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న సలార్ పై ఒక లుక్కేయండి.

Exit mobile version