Prabhas: ఉప్పలపాటి ప్రభాస్ రాజు.. ఈ పేరులో ఉండే మ్యాజిక్ వేరు. ఆతిథ్యం ఇవ్వడంలో ఈ కుటుంబం తరువాతే ఎవరైనా.. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి కడుపు నింపే రాజుల కుటుంబం అంటే కృష్ణంరాజు కుటుంబమే. పెద్దనాన్న పోలికలే కాకుండా ఆయన ఆచార అలవాట్లను కూడా పుణికిపుచ్చుకున్నాడు ప్రభాస్. ఇక ఇదొక్కటేనా అభిమానులు కష్టాల్లో ఉన్నా.. తమదగ్గర పనిచేసేవారు కష్టాల్లో ఉన్నా నేనున్నా అంటూ చెయ్యి అందించడంలో ప్రభాస్ ఎప్పుడు ముందే ఉంటాడు. ఇక ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే.. ప్రభాస్ గొప్ప మనసు గురించి మరోసారి సోషల్ మీడియా కోడై కూస్తోంది కాబట్టి. అసలు విషయం ఏంటంటే.. ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో సలార్ ఒకటి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తోంది. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సలార్ సెట్ లో పనిచేస్తున్న స్టాఫ్ అందరికి ప్రభాస్ తలో పదివేలు అకౌంట్ లో వేసినట్లు వార్తలు వస్తున్నాయి.
OG: పవన్ కు విలన్ గా బాలీవుడ్ నటుడు..
గత కొన్నిరోజులుగా వారందరు కూడా నిరంతరాయంగా పనిచేశారట. ఇంటికి కూడా వెళ్లకుండా సినిమా కోసం డెడికేషన్ గా వర్క్ చేయడంతో.. వారి కష్టాన్నికి కొద్దో గొప్పో సాయంగా వారి అకౌంట్స్ లో పదివేలు వేసినట్లు చెప్పుకొస్తున్నారు. అయితే ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే ప్రస్తుతం సలార్ షూటింగ్ కు కొద్దిగా గ్యాప్ ఇచ్చాడు ప్రభాస్. తన మోకాలి సర్జరీ కోసం ప్రభాస్ అమెరికాకు వెళ్లినట్లు తెలుస్తోంది. మళ్లీ ఇండియా తిరిగి రాగానే ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. ఇకపోతే ఈ చిత్రం ఈ ఏడాది సెప్టెంబర్ లో రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో ప్రభాస్ ఇంకెన్ని రికార్డులు బద్దలుకొడతాడో చూడాలి.
