Site icon NTV Telugu

Salaar : అతిథి పాత్రలో మరో స్టార్… రివీల్ చేసిన ప్రభాస్

Prabhas

Prabhas

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ “రాధే శ్యామ్” చిత్రం విడుదలకు నేటితో కలిపి మరో రెండ్రోజులే ఉండడంతో సందడి నెలకొంది. ప్రస్తుతం టీం ఈ సినిమా కోసం దూకుడుగా ప్రమోషన్లు చేస్తున్నారు. “రాధేశ్యామ్” మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుందన్న విషయం తెలిసిందే. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించింది. యూవీ క్రియేషన్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు, భాగ్యశ్రీ, కృష్ణంరాజు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ బహుభాషా చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీత దర్శకుడు.

Read also : Mallemala : శ్యామ్ ప్రసాద్ రెడ్డి మాయాజాలం!

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ తన తదుపరి చిత్రం”సలార్” గురించి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు. మలయాళంలో “రాధే శ్యామ్‌”కి తన వాయిస్ అందించినందుకు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌కు ధన్యవాదాలు తెలుపుతూ క్రేజీ అప్డేట్ ఇచ్చేశాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “సలార్‌”లో పృథ్వీరాజ్ కూడా భాగమని ప్రభాస్ రివీల్ చేసేశాడు. ఇది జినంగా సర్ప్రైజ్ అనే చెప్పాలి. ఇప్పటి వరకూ ఈ చిత్రంలో మరో స్టార్ హీరో ఉంటాడని ఎవరూ ఊహించలేదు. ప్రభాస్ ఇలా అనూహ్యంగా ‘రాధేశ్యామ్’ ప్రమోషన్లలో ‘సలార్’ అప్డేట్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

Exit mobile version