NTV Telugu Site icon

Prabhas: మొహమాటానికి పోయి సినిమాలు చేయకు ప్రభాస్ అన్నా..?

Prabhas

Prabhas

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. ఇప్పటికే ఆదిపురుష్ రిలీజ్ కు రెడీ అవుతుండగా.. సలార్, ప్రాజెక్ట్ కె ను పట్టాలెక్కించాడు. ఏకధాటిగా ఈ రెండు సినిమాలను పూర్తి చేయడానికి కంకణం కట్టుకున్న డార్లింగ్ కు మధ్యలో ఒక చిన్న సినిమాపై కన్ను పడింది. మారుతీ దర్శకత్వంలో ప్రభాస్.. రాజా డీలక్స్ సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. కామెడీ హర్రర్ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కుతోందని తెలుస్తోంది. సీక్రెట్ గా ఈ సినిమాను కూడా ప్రభాస్ పూర్తి చేస్తున్నాడట. ముందు నుంచే ప్రభాస్ ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ సినిమా కాకుండా ఒక చిన్న సినిమాగా రిలీజ్ చేయాలనీ ప్లానింగ్ లో ఉన్నాడట. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరో అనగానే ఆటోమేటిక్ గా సినిమా పై అంచనాలే కాదు బడ్జెట్ కూడా ఎక్కువే ఉంటుంది. ఎంత తగ్గించినా హీరో, హీరోయిన్ల రెమ్యూనిరేషనే దాదాపు రూ. 50 కోట్ల వరకు ఉంటుంది. అక్కడే భారీ బడ్జెట్ అవ్వడానికి అవకాశం ఉంది. దీంతో ప్రభాస్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

Akkineni Nagarjuna: ఈ లుక్ లో ఒక సినిమా పడితే మాస్టారూ…

బడ్జెట్ ఎక్కువ కాకుండా ప్రభాస్ తన రెమ్యూనిరేషన్ ను త్యాగం చేసినట్లు సమాచారం. ఈ సినిమాకు ప్రభాస్ రెమ్యూనిరేషన్ వద్దని చెప్పాడట, దీంతో బడ్జెట్ ఎక్కువ కాకుండా సినిమాను పూర్తి చేయవచ్చని సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ వార్త తెలియడంతో ప్రభాస్ అభిమానులు అది కాదు.. డార్లింగ్.. అంత త్యాగం చేయాల్సిన అవసరం ఏముంది..? నిదానంగా పాన్ ఇండియా సినిమాలను రిలీజ్ చేశాక చేసుకోవచ్చుగా అని కొందరు.. మొహమాటానికి పోయి సినిమాలు చేయకు ప్రభాస్ అన్నా అని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.

Show comments