రెబల్ స్టార్ ప్రభాస్ కు ప్రపంచమంతటా అభిమానులున్నారు. ఈ ఫ్యాన్స్ ప్రభాస్ పుట్టినరోజున, ఆయన కొత్త సినిమా రిలీజైన సందర్భంలో తమ అభిమానాన్ని వినూత్న పద్ధతిలో ప్రదర్శించడం చూస్తుంటాం. ప్రభాస్ నటించిన ప్రెస్టీజియస్ మూవీ సలార్ మరో అయిదు రోజుల్లో గ్రాండ్ గా థియేటర్స్ లోకి రిలీజ్ కు వస్తోంది. ఈ నేపథ్యంలో కెనడాలోని రెబల్ స్టార్ అభిమానులు తమ ఫేవరేట్ హీరో ప్రభాస్ కు ఎయిర్ సెల్యూట్ చేశారు. నేల మీద భారీ సలార్ పోస్టర్ డిజైన్ చేయించి..వివిధ రంగుల్లోని ఆరు హెలికాప్టర్స్ తో గాలి నుంచి ఆ పోస్టర్ కు సెల్యూట్ చేయించారు. చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ ఈ వీడియోను షేర్ చేసింది. ఓ భారీ హాలీవుడ్ సినిమా స్టైల్ లో యూనివర్సల్ డార్లింగ్ ప్రభాస్ కోసం అభిమానులు చేసిన ఈ ఫీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ నెల 22న సలార్ ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా రెబల్ స్టార్ అభిమానులు వెయిట్ చేస్తున్నారు. అభిమానుల్లో జోష్ మరింత పెంచడానికి ప్రశాంత్ నీల్ సలార్ సినిమా నుంచి రిలీజ్ ట్రైలర్ ని లాంచ్ చేస్తున్నాడు. ప్రభాస్ క్యారెక్టర్ సెంట్రిక్ గా కట్ చేసిన ఈ ట్రైలర్ సలార్ బజ్ ని మరింత పెంచనుందట. ఈరోజు సాయంత్రం సలార్ రిలీజ్ ట్రైలర్ బయటకి వస్తుందని సమాచారం. ఫస్ట్ ట్రైలర్ లో పృథ్వీరాజ్ ఎక్కువగా ప్రభాస్ తక్కువగా ఉన్నాడు అని ఫీల్ అయిన వాళ్లకి ఫుల్ మీల్స్ పెట్టేలా సెకండ్ ట్రైలర్ ఉండబోతుంది అంటున్నారు. మరి ఏ రేంజులో ఉంటుందో తెలియాలి అంటే ఇంకొన్ని గంటలు వెయిట్ చెయ్యాల్సిందే.
