NTV Telugu Site icon

Salaar Trailer: బెంగుళూరులో ‘డైనోసర్’ని కలవనున్న ‘మాన్‌స్టర్’…

Salaar Trailer

Salaar Trailer

ఇప్పటివరకు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర నమోదైన రికార్డ్స్ కి ఎండ్ కార్డ్ వేసి, కొత్త బెంచ్ మార్క్ సెట్ చేయడానికి సలార్ వస్తుంది. రెబల్ స్టార్ ప్రభాస్-పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న ‘సలార్’ సినిమా సెప్టెంబర్ 28న ఆడియన్స్ ముందుకి రానుంది. ప్రస్తుతం రిలీజ్ కానున్న సినిమాల్లో సలార్ మైంటైన్ చేస్తున్న హైప్, ఏ ఇండియన్ సినిమాకి లేదు. ప్రభాస్ ఫేస్ కూడా రివీల్ చేయకుండా కట్ చేసిన గ్లిమ్ప్స్ కి 24 గంటల్లో 83 మిలియన్ వ్యూస్ వచ్చాయి అంటే సలార్ పై అంచనాలు ఏ రేంజులో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. ఈ అంచనాలని ఆకాశాన్ని తాకేలా చేయడానికి సలార్ ట్రైలర్ బయటకి రాబోతుంది. సలార్ రిలీజ్ కి నెల రోజుల సమయం మాత్రమే ఉంది, మేకర్స్ మాత్రం ప్రమోషన్స్ చెయ్యట్లేదు అంటూ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. నిజానికి సలార్ సినిమాపై ఉన్న అంచనాలకి ప్రమోషన్స్ అంతగా చేయాల్సిన అవసరం లేదు.

ఇప్పటికిప్పుడు థియేటర్స్ లో సలార్ సినిమాని రిలీజ్ చేసినా, టాక్ కాస్త బాగుంటే చాలు ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తుంది. సినిమాపై మేకర్స్ అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ కూడా అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అందుకే సాంగ్స్, పోస్టర్స్ అనే వాటి జోలికి పోకుండా డైరెక్ట్ గా ట్రైలర్ ని రంగంలోకి దించుతున్నారు. సెప్టెంబర్ 6న సలార్ ట్రైలర్ బయటకి రానుందని సమాచారం. ఇక్కడే హ్యూజ్ ట్విస్ట్ ఉంది… సలార్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని బెంగళూరులో చేయనున్నారు, ఈ ఈవెంట్ కి రాఖీ భాయ్ యష్ గెస్టుగా రానున్నాడని కర్ణాటక మీడియాలో వినిపిస్తున్న టాక్. ఒకే ఈవెంట్ లో ప్రభాస్-యష్ కలిస్తే ఆ ఈవెంట్ రీచ్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒకరేమో డైనోసర్ ఇంకొకరేమో మాన్‌స్టర్ కాబట్టి ఈ ఇద్దరి మీటింగ్ పాయింట్ లో లాంచ్ అయితే చాలు సలార్ ట్రైలర్ ఏ డిజిటల్ రికార్డుని మిగిలించదు.

Show comments