NTV Telugu Site icon

Prabhas: ఈ కాంబినేషన్ రెడ్ అలర్ట్ ని ప్రకటించేలా ఉంది…

Prabhas

Prabhas

టాలీవుడ్‌లో ఇప్పటి వరకు ఎన్నో క్రేజీ కాంబినేషన్స్ సెట్ అయ్యాయి కానీ ఈ ఒక్క కాంబినేషన్ పడితే.. చూడాలని ఎప్పటి నుంచో వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు ఆడియెన్స్. ఇప్పటికే ఈ క్రేజీ కాంబో పై ఎన్నో వార్తలొచ్చాయి కానీ లేటెస్ట్ అప్డేట్ మాత్రం బాక్సాఫీస్ రికార్డులకి రెడ్ అలర్ట్ జారీ చేస్తున్నట్లుగా ఉంది. ప్రభాస్ కటౌట్‌కి లెక్కల మాస్టారు సుకుమార్ ఎలివేషన్ తోడైతే నెక్స్ట్ లెవల్ అనేలా ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్‌గా జగడం సినిమాలోని రామ్‌ను ఎలివేట్ చేసే షాడో షాట్ ఒక్కటి చాలు. రామ్ పోతినేనినే అలా చూపిస్తే ఇక ప్రభాస్ లాంటి సాలిడ్ కటౌట్‌ని సుకుమార్ ఏ రేంజ్‌లో చూపిస్తాడో ఊహించుకోవచ్చు. ఇప్పుడదే జరగబోతుంది అనే న్యూస్ వైరల్ అవుతోంది. అసలు ఆర్య సినిమాను ముందుగా ప్రభాస్‌తో చేయాలని అనుకున్నాడు సుకుమార్ బట్ కథ డిమాండ్ మేరకు అల్లు అర్జున్ ఆ ప్రాజెక్ట్‌లోకి వచ్చాడు. అప్పటి నుంచి ప్రభాస్, సుకుమార్ కాంబో తరచుగా తెరపైకి వస్తునే ఉంది కానీ అస్సలు కుదరడం లేదు. అయితే ఇప్పుడు మాత్రం దాదాపుగా ఫిక్స్ అయిందనే న్యూస్ వైరల్‌గా మారింది.

ఇండస్ట్రీలో జరుగుతున్న ప్రచారం ప్రకారం రీసెంట్‌గా సుకుమార్ చెప్పిన కథకు ప్రభాస్ ఫిదా అయ్యాడట. అంతేకాదు.. ఈ ప్రాజెక్ట్ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్‌లో ఉంటుందనే టాక్ నడుస్తోంది. ‘పుష్ప2’ అయిపోగానే.. సుకుమార్, ప్రభాస్ కోసమే స్క్రిప్ట్ రెడీ చేయనున్నాడనే రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. పుష్ప 2 తర్వాత సుకుమార్ ప్రాజెక్ట్ పై ఇంకా క్లారిటీ లేదు. విజయ్ దేవరకొండతో ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినా ఉంటుందని ఖచ్చితంగా చెప్పలేం. పుష్ప 2 కంప్లీట్ అయి, స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యే లోపు.. ప్రభాస్ కమిట్మెంట్స్ అన్ని పూర్తి కానున్నాయి. దాంతో ఈసారి ప్రభాస్, సుకుమార్ కాంబినేషన్ ఫిక్స్ అయినట్టేనని అంటున్నారు. ఇదే జరిగితే బాక్సాఫీస్ దగ్గర విధ్వంసమేనని చెప్పొచ్చు.

Show comments