నిజానికి, అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ చేసిన ‘ఆర్య’ సినిమాలో మొదట హీరోగా ప్రభాస్ ని అనుకున్నారు. ప్రభాస్ కి కథ చెప్పాక, ఆయన ఈ కథ తనకు సూట్ అవ్వదు అని చెప్పారు. ఆ తర్వాత ఎన్ని సార్లు ప్రభాస్ తో సినిమా చేయాలని సుకుమార్ ప్రయత్నాలు చేసినా ఎందుకో అవి వర్కౌట్ కాలేదు. అయితే, ఇప్పుడు సుకుమార్ ‘పుష్ప’ సూపర్ సక్సెస్ తో మంచి ఫామ్ లో ఉన్నారు. ఆయన తన తదుపరి చిత్రాన్ని రాంచరణ్ హీరోగా చేయబోతున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఆయన ఒక కథ రాసుకున్నారు అని, ఆ కథ ప్రభాస్ కి చెప్పగా అందుకు ప్రభాస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.
Also Read: Lokesh Kanagaraj : పవన్’తో అలాంటి సినిమా.. లోకేష్ మార్క్ అరాచకం?
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సినిమాని దిల్ రాజు ప్రొడక్షన్స్ లో నిర్మిస్తున్నారు. భారీ స్కేల్లో, భారీ తారాగణంతో ఈ సినిమాని రూపొందించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఒక రకంగా చెప్పాలంటే, ‘పుష్ప’ లాంటి సినిమా చేసిన సుకుమార్, ‘బాహుబలి’, ‘సాహో’ వరకు రకరకాల సినిమాలతో ఆకట్టుకుంటున్న ప్రభాస్ కాంబినేషన్ గనక సెట్ అయితే, ఇక బాక్స్ ఆఫీస్ ఊపిరి పీల్చుకోవాల్సిందే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తం మీద వీరిద్దరి కాంబినేషన్ సెట్ అయితే మాత్రం, టాలీవుడ్ లోనే కాదు ఇండియన్ సినీ హిస్టరీలోనే సరికొత్త రికార్డులు సెట్ అయ్యే అవకాశం ఉంది
