ఈరోజు ప్రతి తెలుగు సినిమా పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తుంది, ఎన్నో సౌత్ సినిమాలు నార్త్ లో మార్కెట్ ని క్రియేట్ చేసుకుంటున్నాయి. బాలీవుడ్ కే కాంపిటీషన్ ఇచ్చే రేంజులో మన సినిమాలు నార్త్ మార్కెట్ లో సత్తా చాటుతూ ఉన్నాయి. వీటన్నింటికీ వెనక ఉన్నది, అందరికన్నా మొదటి అడుగు వేసినది రాజమౌళి. దర్శక ధీరుడిగా తెలుగు ఆడియన్స్ కి మాత్రమే పరిమితం అయిన రాజమౌళి, ఈ జనరేషన్ కి పాన్ ఇండియా అనే పదాన్ని పరిచయం చేస్తూ బాహుబలి సినిమా చేశాడు. రాజమౌళి ఏ హీరోతో వర్క్ చేసినా, అసలు హీరో లేకుండానే సినిమా చేసినా ఆ మూవీ అదిరిపోతుంది కానీ రాజమౌళి, ప్రభాస్ తో సినిమా చేస్తే మాత్రం దాని రిజల్ట్ నెవర్ బిఫోర్ అనేలా ఉంటుంది. అందుకే ప్రభాస్, రాజమౌళిలది డెడ్లీ కాంబినేషన్. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు, ఆస్కార్ అవార్డులు వస్తున్నాయంటే.. ఈ ఇద్దరే మూల కారణం. ప్రభాస్, రాజమౌళి లేకపోతే.. తెలుగు సినిమా రేంజ్ హాలీవుడ్ వరకు వెళ్లేదా… అంటే ఖచ్చితంగా కాదనే చెప్పాలి. ఒకే ఒక్క సినిమాతో ఎన్నో వండర్స్ క్రియేట్ చేశారు ఈ ఇద్దరు. దాదాపు ఐదేళ్లు బాహుబలి సినిమాతోనే ట్రావెల్ చేసి.. సిల్వర్ స్క్రీన్ పై అద్భుతమే చేశారు. ఛత్రపతి సినిమాతో మొదలైన ప్రభాస్, రాజమౌళి జర్నీ.. బాహుబలి సిరీస్‌తో పీక్స్‌కు వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ ఇద్దరు ఎవరి ప్రాజెక్ట్స్‌తో వారు బిజీగా ఉన్నారు. ప్రభాస్ చేతిలో నాలుగైదు సినిమాలుండగా.. రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. అయితే మహేష్ తర్వాత రాజమౌళి నెక్స్ట్ హీరో ఎవరనే విషయంలో ఎవరికీ క్లారిటీ లేదు అయితే మళ్లీ ప్రభాస్, రాజమౌళి కలిసి సినిమా చేయడం మాత్రం పక్కా అనే వార్త ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
గతంలో రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతంలో ప్రభాస్ కర్ణుడిగా నటిస్తాడని చెప్పుకొచ్చారు. కానీ ఈ ప్రాజెక్ట్ ఎప్పుడుంటుందో ఇప్పుడే చెప్పలేం. అయితే ఈలోపు మరోసారి ఈ పవర్ హౌజ్ కాంబో ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. అదే జరిగతే జస్ట్ అనౌన్స్మెంట్‌కే సునామి రావడం గ్యారెంటీ. దాదాపుగా ఈ పవర్ ఫుల్ కాంబినేషన్ ఫిక్స్ అయిపోయిందనే అంచనాకు వచ్చేస్తున్నారు ఇండస్ట్రీ ప్రముఖులు. ఇటీవల నిర్మాత దిల్ రాజుకు ప్రభాస్‌తో సినిమా ఎప్పుడు అంటూ.. ఓ ప్రశ్న ఎదురైంది. రాజమౌళితో చేస్తున్నాడు.. ఆ సినిమా అయ్యాక మా కాంబో ఉండబోతుందని చెప్పారు దిల్ రాజు. ఈ లెక్కన నెక్స్ట్ మహేష్ సినిమా తర్వాత ప్రభాస్‌తోనే రాజమౌళి సినిమా ఉంటుందని ఓ అంచనాకు వచ్చేశారు. మహేష్ ప్రాజెక్ట్ అయిపోయేలోపు ప్రభాస్ కమిట్ అయిన సినిమాలు కంప్లీట్ కానున్నాయి. కాబట్టి రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రభాస్‌తోనే అంటున్నారు. అదే జరిగితే.. బాక్సాఫీస్ దగ్గర ఆ సినిమా మరో వండర్‌గా నిలిచిపోతుందని చెప్పొచ్చు. చూడాలి మరి.. ప్రభాస్, రాజమౌళి మళ్లీ ఎప్పుడు కలుస్తారో!
