Site icon NTV Telugu

Prabhas: ఆ డెడ్లీ కాంబినేషన్ ని మరోసారి కన్ఫర్మ్ దిల్ రాజు…

Dil Raju

Dil Raju

ఈ జనరేషన్ కి పాన్ ఇండియా అనే పదాన్ని పరిచయం చేసిన ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్నింటిలో ‘సలార్’ మూవీ పై ఉన్నన్ని అంచనాలు వేరే ఏ సినిమాపై లేవు. బాట్ మాన్ సినిమాకి వాడిన టెక్నాలజీతో తెరకెక్కుతున్న ఎపిక్ యాక్షన్ డ్రామాని టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులో ప్రభాస్ డ్యూయెల్ రోల్ చేస్తున్నాడనే టాక్ ఉంది అందులో ఒక పాత్రలో భయంకరమైన నెగటివ్ షేడ్ లో కనిపించబోతున్నాడని అంటున్నారు. సలార్ మూవీని రెండు భాగాలుగా ఆడియన్స్ ముందుకి తీసుకురాబోతున్నట్టు వార్తలు వినిపిస్తునే ఉన్నాయి కాబట్టి ఈ కాంబినేషన్ ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంది అనడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. సలార్ పార్ట్ 1 అండ్ 2తో ప్రభాస్-=ప్రశాంత్  నీల్ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర విధ్వంసం సృష్టించే పనిలో ఉంటే, ఈ కాంబినేషన్ ని మూడోసారి రిపీట్ చేయించే పనిలో ఉన్నాడు దిల్ రాజు. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో ‘గేమ్ ఛేంజర్’ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు దిల్ రాజు. ఆ తర్వాత ఎన్టీఆర్, ప్రభాస్, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలందరితోనూ సినిమాలని లైనప్ లో పెట్టాడు.

ఈ లైనప్ లోనే ప్రభాస్-ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ఉంటుంది అని గతంలోనే చెప్పిన దిల్ రాజు,  రీసెంట్‌గా ఓ ఇంటర్య్వూలో ఇదే విషయాన్ని మరోసారి కన్ఫర్మ్ చేసాడు. ఇప్పటికే ప్ర‌భాస్‌, ప్ర‌శాంత్ నీల్‌ల‌తో డిస్క‌ష‌న్స్ జ‌రిగిన‌ట్లు దిల్‌రాజు పేర్కొన్నాడు. ఈ హీరో-డైరెక్టర్ డేట్స్‌ విష‌యంలో కూడా ఒక క్లారిటీ వ‌చ్చిన‌ట్లు దిల్ రాజు చెప్పుకొచ్చాడు. ప్ర‌స్తుతం ప్రభాస్ మూడు, నాలుగు భారీ ప్రాజెక్స్ట్ చేస్తున్నాడు. సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ కూడా ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేయనున్నాడు. ఆ త‌ర్వాతే మరోసారి ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోని సెట్స్ పైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు దిల్ రాజు. నిన్న మొన్నటి వరకు మరోసారి ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో దిల్ రాజు ప్రాజెక్ట్ ఉంటుదా? లేదా? అనే అనుమానాలు ఉండేవి కానీ మళ్లీ దిల్‌రాజు క్లారిటీ ఇవ్వ‌డంతో ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎప్పుడుటుందో చూడాలి.

Exit mobile version