ప్రభాస్ నెక్స్ట్ మూవీ లాంచ్ కు ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. ప్రభాస్ హీరోగా రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా రూపొందిన “రాధే శ్యామ్” చిత్రం అంచనాలను అందుకోలేకయింది. దీంతో ప్రభాస్ ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై దృష్టి సారించాడు. అయితే భారీ బడ్జెట్ సినిమాలే కాకుండా మినీ బడ్జెట్ సినిమాలు చేయాలనీ భావిస్తున్నట్టు “రాధేశ్యామ్” ప్రమోషన్లలో ప్రభాస్ వెల్లడించిన విషయం తెలిసిందే. అన్నట్టుగానే యంగ్ డైరెక్టర్ మారుతితో ప్రభాస్ ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతోంది.
Read Also : Ram Charan : థియేటర్లోకి చెర్రీ సడన్ ఎంట్రీ… ఆడియన్స్ కు సర్ప్రైజ్
అయితే మారుతీ ఇటీవలే ఫైనల్ స్క్రిప్ట్‌ను లాక్ చేసాడు. అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ హౌస్ సెట్‌ను నిర్మించారు. ఇక్కడే ఈ సినిమా ఎక్కువ భాగం షూటింగ్ జరుపుకోనుంది అని అంటున్నారు. ఈ సినిమా గ్రాండ్ లాంచ్ ఏప్రిల్ 10న హైదరాబాద్‌లో జరగనుందనేది తాజా సమాచారం. మే మొదటి వారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. ఈ హర్రర్-కామెడీకి “రాజా డీలక్స్” అనే టైటిల్‌ని పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారు. హీరోయిన్ల జాబితాలో రాశి ఖన్నా, మాళవిక మోహనన్, శ్రీలీల పేర్లు విన్పిస్తున్నాయి. డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తుండగా, రెండు షెడ్యూల్స్‌లో షూటింగ్‌ను పూర్తి చేసేందుకు ప్రభాస్ ప్లాన్ చేస్తున్నారు. మరిన్ని వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. ఇటీవల స్పెయిన్‌లో శస్త్రచికిత్స చేయించుకున్న ప్రభాస్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు.
