Site icon NTV Telugu

Unstoppable: రికార్డ్స్ వేట మొదలయ్యింది…

Unstoppable

Unstoppable

రెండు పవర్ హౌజ్ లు కలిస్తే ఎలా ఉంటుందో చూపించారు బాలకృష్ణ అండ్ ప్రభాస్. ఈ ఇద్దరి దెబ్బకి ఆహా ఆప్ కూడా క్రాష్ అయిపొయింది అంటే ఎంత మంది అభిమానులు ఈ బాహుబలి ఎపిసోడ్ ని ఎదురు చూస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. దాదాపు 53 నిమిషాల నిడివితో బయటకి వచ్చిన ఈ ఎపిసోడ్ లో గోపీచంద్ ఎంట్రీతో ఆపేసి, మిగిలింది పార్ట్ 2లో చూసుకోండి అని చెప్పేశారు. బాహుబలి ఎపిసోడ్ పార్ట్ 2 జనవరి 6న ప్రీమియర్ కానుంది. పార్ట్ 1 వరకూ మాట్లాడుకుంటే ప్రభాస్ లుక్, బాలయ్య ప్రభాస్ ల మధ్య ఉన్న బాండింగ్, చరణ్-బాలకృష్ణ-ప్రభాస్ ల మధ్య జరిగిన ఫోన్ కాన్వర్జేషణ్ లాంటి అంశాలు హైలైట్ అయ్యాయి. ప్రభాస్ చిన్నప్పటి ఫోటోలు ఆకట్టుకున్నాయి, అందరికీ భోజనం పెట్టడం గురించి ప్రభాస్ చెప్తుంటే అందరికీ కృష్ణంరాజు గుర్తొస్తారు.

అల్లు అర్జున్, మహేశ్ బాబు లాంటి స్టార్ హీరోలు వచ్చినా చెక్కు చెదరని ఆహా ఆప్, ప్రభాస్ దెబ్బకి క్రాష్ అయ్యింది. సబ్ టైటిల్స్ కూడా యాడ్ చెయ్యడంతో పాన్ ఇండియా మొత్తంలో ఉన్న రెబల్ స్టార్ ఆహా ఆప్ ఓపెన్ చేశారు. ఈ కారణంగానే ఆప్ క్రాష్ అయ్యింది. ఇమ్మిడియేట్  గా రెస్పాండ్ అయిన ఆహా టీం, ఆప్ ని తిరిగి అవైలబిలిటిలోకి తీసుకోని వచ్చారు. దీంతో కేవలం 12 గంటల్లోనే ఈ బాహుబలి ఎపిసోడ్ పార్ట్ 1 50 మిలియన్ వ్యూస్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. టాక్ షోస్ హిస్టరీలోనే ఏ ఇంటర్నేషనల్ ఎపిసోడ్ కి రానంత వ్యూవర్షిప్ ని ప్రభాస్ రాబట్టాడు. పార్ట్ 2ని సరిగ్గా గోపీచంద్ ఎంట్రీతో ఆపారు, గోపీచంద్-ప్రభాస్ లు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి పార్ట్ 2లో ఫన్ డోస్ ఇంకాస్త ఎక్కువగానే ఉంటుంది. మరి అన్ స్టాపబుల్ వ్యూవర్షిప్ లోనే ఒక కొత్త బెంచ్ మార్క్ సెట్ చేశాడు ప్రభాస్, ఈ బాహుబలి రికార్డ్స్ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేపుతాడేమో చూడాలి.

Exit mobile version