గత నెల రోజులుగా నాన్ స్టాప్‌గా ఎక్కడ చూసిన ప్రభాస్ గురించే మాట్లాడుతున్నారు. డిసెంబర్ 22న సలార్ రిలీజ్ అవగా… అంతకుముందు ట్రైలర్, సాంగ్స్ అంటూ ప్రమోషన్స్‌తో రచ్చ చేశారు డార్లింగ్ ఫ్యాన్స్. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత డే వన్ రికార్డులు మొదలుకొని… సలార్ ఫైనల్ కలెక్షన్స్ వరకు సోషల్ మీడియాను కబ్జా చేశాడు ప్రభాస్. సంక్రాంతి సినిమాలు థియేటర్లోకి వచ్చే వరకు మూడు వారాల పాటు సలార్‌దే హవా నడిచింది. ఇప్పటికే 700 కోట్ల మార్క్ క్రాస్ చేసిన సలార్‌కు సంక్రాంతి సినిమాల రాకతో క్లోజింగ్ టైం వచ్చేసింది. అయినా కూడా సంక్రాంతికి దూసుకొస్తున్నాడు డార్లింగ్. అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ కల్కి, మారుతి సినిమాల అప్డేట్స్‌తో ఫ్యాన్స్‌కు ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు.
కల్కి సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేసి సంక్రాంతిని స్టార్ట్ చేసిన ప్రభాస్… మారుతి సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రివీల్ చేయనున్నాడు. ఇప్పటికే అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశారు కాబట్టి.. ఈ సంక్రాంతికి థియేటర్లోకి ప్రభాస్ కొత్త సినిమా రిలీజ్ అవకపోయినా… కల్కి, మారుతి సినిమాలతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాడు. ఇప్పటికే మారుతి సినిమా చాలా భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. కల్కి షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది. మే 9న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఏదేమైనా… ఈ సంక్రాంతికి కొత్త సినిమాల అప్డేట్స్‌తో ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేస్తున్నాడు ప్రభాస్.
