Site icon NTV Telugu

Adipurush: ప్రీమియర్స్ క్యాన్సిల్… మేకర్స్ కి ముందు జాగ్రత్త బాగానే ఉంది

Adipurush

Adipurush

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ థియేటర్లోకి రావడానికి మరో నెల రోజులు మాత్రమే ఉంది. జూన్ 16న థియేటర్లన్నీ రామ మందిరాలుగా మారనున్నాయి. ఇప్పటికే ట్రైలర్‌తో ఆ విషయాన్ని చెప్పకనే చెప్పేశారు మేకర్స్. ఖచ్చితంగా ఓం రౌత్ ‘ఆదిపురుష్‌’తో వండర్స్ క్రియేట్ చేస్తాడని అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. ట్రైలర్ చూసిన తర్వాత ఆదిపురుష్ లెక్కలన్నీ తారుమారయ్యాయి. బిజినెస్ కూడా భారీగా జరుగుతున్నట్టు తెలుస్తోంది. 600 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర వెయ్యి కోట్లు రాబడుతుందని అంచనా వేస్తున్నాయి ట్రేడ్ వర్గాలు. ముఖ్యంగా ఆదిపురుష్ ఓపెనింగ్స్‌ రికార్డ్ ఓ రేంజ్‌లో ఉండే ఛాన్స్ ఉంది. అందుకే మూడు రోజుల ముందుగా వేయాల్సిన ఆదిపురుష్ ప్రీమియర్స్‌ షోని క్యాన్సిల్ చేసినట్టు తెలుస్తోంది. రామాయణం ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని.. న్యూయార్క్‌ వేదికగా జూన్‌ 7 నుంచి 18 వరకు జరగనున్న ట్రిబెకా ఫెస్టివల్‌లో.. జూన్‌ 13న ప్రీమియర్స్‌ను ప్లాన్ చేశారు.

ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ అవగా భారీ రెస్పాన్స్ వచ్చింది. దాంతో ప్రీమియర్ షోస్ కూడా పెంచారు. అయితే ఇప్పుడు జూన్ 13 ఉండాల్సిన షోని క్యాన్సిల్ చేసి.. జూన్ 15కి మార్చినట్టు తెలుస్తోంది. ఈ ప్రీమియర్‌ షోని క్రిటిక్స్‌తో సహా పలువురు సినీ ప్రముఖులు చూడనున్నారు. దాంతో సినిమా రిలీజ్‌కు మూడు రోజుల ముందే ఆదిపురుష్‌ టాక్ బయటకు వచ్చేస్తుంది. సినిమా టాక్ బాగుంటే ఓకే గానీ.. ఏ మాత్రం నెగెటీవ్ టాక్‌ వచ్చినా ఓపెనింగ్స్ పై దెబ్బ పడే ఛాన్స్ ఉంది. సోషల్ మీడియా పుణ్యమా అని.. ఆదిపురుష్ ప్రీమియర్స్ ఎక్కడ పడినా క్షణాల్లో టాక్‌ వరల్డ్ వైడ్‌గా స్ప్రెడ్ అయిపోతుంది. అందుకే ప్రీమియర్స్ కాన్సిల్ చేసినట్టు సమాచారం. జూన్ 15న ప్రీమియర్ కానున్న ఆదిపురుష్ సినిమా నిడివి రెండు గంటల యాభై నాలుగు సినిమాలట. ఇదే ఫైనల్ డ్యురేషన్ అయ్యే అవకాశం ఉంది.

Exit mobile version