NTV Telugu Site icon

Adipurush: రికార్డులు ఉంటే రాసి పెట్టుకోండి… 24 గంటల్లో అన్నీ లేస్తాయ్…

Adipurush

Adipurush

రెబల్ స్టార్ ప్రభాస్ ని శ్రీ రాముడిగా, బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ ని సీతాదేవిగా చూపిస్తూ ఓం రౌత్ తెరకెక్కించిన సినిమా ‘ఆదిపురుష్’. వాల్మీకీ రామాయణం ఆధారంగా రూపొందిన ఈ సినిమా జూన్ 16న ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అవుతోంది. ప్రమోషన్స్ ని పీక్ స్టేజ్ కి తీసుకోని వెళ్తూ మేకర్స్, ఇండియన్ సినిమా హిస్టరీ ఇప్పటివరకూ జరగనంత గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ ని చెయ్యడానికి రెడీ అయ్యారు. తిరుపతిలో అయోధ్య కనిపించేలా దాదాపు రెండు కోట్ల ఖర్చుతో ఆదిపురుష్ ప్రీరిలీజ్ ఈవెంట్ చేస్తున్నారు. బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఆ స్థాయిలో ఇంకా చెప్పాలి అంటే ఆ స్థాయిని మించి జరగబోతున్న ప్రీరిలీజ్ ఈవెంట్ ఇదే. 200 మంది సింగర్స్, 200 మంది డాన్సర్స్, వేల మంది అభిమానుల మధ్య ఆదిపురుష్ ప్రీరిలీజ్ ఈవెంట్ జరగనుంది. ప్రీరిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్టుగా ‘చిన్న జీయర్ స్వామీ’ వస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు.

ఈ ఈవెంట్ లో ఆదిపురుష్ సెకండ్ ట్రైలర్ రిలీజ్ కాబోతుంది. 2:27 నిమిషాల నిడివితో కట్ చేసిన ఈ ట్రైలర్, ఆదిపురుష్ సినిమాపై ఇప్పటికే ఉన్న అంచనాలని తారాస్థాయికి తీసుకోని వెళ్లేలా ఉంటుందని సమాచారం. ఎక్కువగా యాక్షన్ ఎపిసోడ్స్ పైన ద్రుష్టి పెట్టి సెకండ్ ట్రైలర్ ని కట్ చేశారట. ఆదిపురుష్ ప్రీరిలీజ్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రభాస్ ఫాన్స్ ఈ సెకండ్ ట్రైలర్ కోసమే వెయిట్ చేస్తున్నారు. ఈవెంట్ లో ట్రైలర్ రిలీజ్ చేయడం ఆలస్యం ఇప్పటివరకూ ఉన్న డిజిటల్ రికార్డులని బ్రేక్ చేస్తాం, కొత్త హిస్టరీ క్రియేట్ చేస్తాం అంటూ ప్రభాస్ ఫాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇదే జరిగితే మరో 24 గంటల్లో సోషల్ మీడియాలో తుఫాన్ రావడం గ్యారెంటీ.