Site icon NTV Telugu

Adipurush: నార్త్ లో ఆదిపురుష్ ట్రైలర్ ప్రభంజనం…

Adipurush

Adipurush

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఎపిక్ డ్రామా ‘ఆదిపురుష్’. వాల్మీకీ రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతాదేవిగా నటిస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ సైఫ్ అలీ ఖాన్ ‘రావణబ్రహ్మ’గా నటిస్తున్నాడు. హ్యూజ్ బడ్జట్, లార్జ్ స్కేల్ ప్రొడక్షన్, నెవర్ బిఫోర్ విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమా మరో నెల రోజుల్లో ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చెయ్యడానికి రెడీ అవుతోంది. జూన్ నెలలో ఇండియన్ బాక్సాఫీస్ చూడబోతున్న బిగ్గెస్ట్ హిట్ గా ఆదిపురుష్ ప్రమోషన్స్ జరుపుకుంటుంది. రోజు రోజుకీ ఆదిపురుష్ సినిమాపై అంచనాలని పెంచుతున్న మేకర్స్, లేటెస్ట్ గా ఆదిపురుష్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ దెబ్బకి ఇప్పటివరకూ ఆదిపురుష్ సినిమాపై ఉన్న నెగిటివిటి మొత్తం గాల్లో కలిసిపోయింది. ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్, ఓం రౌత్ మేకింగ్ స్టాండర్డ్ రేంజ్ ఏంటో ఆదిపురుష్ ట్రైలర్ లో కనిపించాయి.

ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే థియేటర్స్ లో ర్యాంపేజ్ చూస్తారు అని ఫాన్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. అయితే అందరూ అనుకున్నట్లు ఆదిపురుష్ ట్రైలర్ నార్త్ లో హ్యూజ్ అప్లాజ్ ని అందుకుంటుంది. ఇండియా వైడ్ ట్రెండ్ అవుతున్న ఆదిపురుష్ ట్రైలర్ కేవలం హిందీలో 24 గంటలు తిరగకుండానే 47 మిలియన్ వ్యూస్ రాబట్టింది. 20 గంటల్లో 47 మిలియన్ వ్యూస్, 1 మిలియన్ లైక్స్ ని రాబట్టిన ఆదిపురుష్ ట్రైలర్ సెన్సేషనల్ రీచ్ ని రాబడుతుంది. ఈ రికార్డ్స్ ప్రభాస్ నార్త్ ఫాలోయింగ్ కి నిదర్శనం అనే చెప్పాలి. సౌత్ కన్నా ఎక్కువ నార్త్ లోనే ఆదిపురుష్ ప్రభంజనం కనిపిస్తోంది. ఈ లెక్కన ప్రభాస్ నార్త్ లో జూన్ 16న రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్స్ ని రాబట్టడం గ్యారెంటీ.

Exit mobile version