Site icon NTV Telugu

Prabhas: కింగ్ ఖాన్ రికార్డులని కూడా వణికించాడు…

Prabhas

Prabhas

ఈ జనరేషన్ సినీ అభిమానులు చూసిన బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్. పాన్ ఇండియా స్టార్ అనే పదాన్ని పరిచయం చేసిన ప్రభాస్, ఏ సినిమా చేసినా అది రికార్డులు తిరగరాయడం గ్యారెంటీగా కనిపిస్తోంది. బాహుబలి, బాహుబలి 2, సాహో, రాధే శ్యామ్ సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసాయి. మరీ ముఖ్యంగా కొత్త దర్శకులతో చేసిన ప్రభాస్ లాస్ట్ రెండు సినిమాలైతే రిజల్ట్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ ని రాబట్టాయి. ఇండియాలో మొదటి రోజు వంద కోట్లని రాబట్టిన సినిమాలు ఇప్పటివరకు ఆరు ఉంటే అందులో మూడు ప్రభాస్ వే ఉండడం విశేషం. లేటెస్ట్ గా ఈ ఎలైట్ లిస్టులోకి 7వ సినిమాగా ఎంటర్ అయ్యింది ఆదిపురుష్.

ఓం రౌత్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ డే 1 ఎంత కలెక్ట్ చేస్తుంది అనే విషయంలో చాలా రకాల లెక్కలు వినిపించాయి. అంకెలని పక్కన పెడితే అందరూ చెప్పిన ఒకే ఒక్క మాట ఆదిపురుష్ సినిమా కొత్త రికార్డులని క్రియేట్ చేయబోతుంది అని… అందరూ అనుకున్నట్లే ఆదిపురుష్ సినిమా సెన్సేషన్ సృష్టించింది. డే 1 ఆదిపురుష్ సినిమా 140 కోట్లని రాబట్టి, ఈ ఏడాది బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది. హిందీలో అయితే ఆల్మోస్ట్ పఠాన్ రికార్డులని కూడా ప్రభాస్ బ్రేక్ చేస్తాడేమో అని అక్కడి ఇండస్ట్రీ వర్గాలు కాంగరు పడ్డాయి. కొంచెం మార్జిన్ లో పఠాన్ హిందీ డే 1 కలెక్షన్స్ రికార్డులని మిస్ అయ్యాడు కానీ నార్త్ లో ఆదిపురుష్ సినిమాని ఇంకాస్త గట్టి ప్రమోషన్స్ చేసి ఉంటే పఠాన్ రికార్డ్స్ కూడా బ్రేక్ అయ్యేవి. లాంగ్ రన్ లో కూడా ఆదిపురుష్ ముందున్న పెద్ద లక్ష్యం పఠాన్ సినిమానే. వెయ్యి కోట్లని రాబట్టిన పఠాన్ సినిమా కలెక్షన్స్ ని ఫుల్ రన్ లో ఆదిపురుష్ బ్రేక్ చేస్తుందేమో చూడాలి.

Exit mobile version