Site icon NTV Telugu

Adipurush: ‘ఆదిపురుష్‌’ రన్ టైం లాక్… ‘జై శ్రీరామ్’ ఫుల్ సాంగ్ వచ్చేస్తోంది!

Adipurush

Adipurush

ఆదిపురుష్‌ టాక్‌ను నెగెటివ్ నుంచి పాజిటివ్‌గా మార్చింది జై శ్రీరామ్ సాంగ్. ఇప్పటికే రిలీజ్ చేసిన వన్ మినిట్ డ్యూరేషన్ సాంగ్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది, ట్రైలర్‌లో కూడా ఈ సాంగ్‌ హైలెట్‌గా నిలిచింది. దాంతో జై శ్రీరామ్ ఫుల్ సాంగ్ ఎప్పుడొస్తుందా? అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. తాజాగా ఈ సాంగ్ రిలీజ్ డేట్ ని మేకర్స్ ఫిక్స్ చేశారు. మే 20న జై శ్రీరామ్ సాంగ్ ని విడుదల చేయనునున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ సాంగ్ ఫుల్ వెర్షన్ బయటకి వస్తే ఆదిపురుష్ సినిమాపై అంచనాలు మరింత పెరగడం గ్యారెంటీ. ఇదిలా ఉంటే… చాలా రోజులుగా ఆదిపురుష్ రన్ టైమ్ గురించి టాక్ నడుస్తునే ఉంది. అయితే ఇప్పుడు ఆదిపురుష్ నిడివి లాక్ అయినట్టు తెలుస్తోంది. ఇండియ‌న్ వెర్ష‌న్ ర‌న్‌టైమ్ రెండు గంట‌ల యాభై ఆరు నిమిషాల నిడివి ఉండ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

ఓవ‌ర్‌సీస్ వెర్ష‌న్ రెండు నిమిషాలు త‌క్కువ‌గా అంటే రెండు గంట‌ల యాభై నాలుగు నిమిషాలు ఉంటుందని తెలుస్తోంది. దీంతో ప్ర‌భాస్ కెరీర్‌లోనే అత్యధిక నిడివితో వస్తున్న సినిమాగా ఆదిపురుష్ నిల‌వ‌నుంది. మొత్తంగా ఇంటర్వెల్ తో కలుపుకోని ఆదిపురుష్ సినిమా కోసం థియేటర్లో మూడు గంటలకు పైగా సమాయాన్ని కేటాయించాల్సిందే. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను జూన్ 16న గ్రాండ్‌గా అన్ని భాషల్లో 2డి, 3డిలో రిలీజ్ చేయబోతున్నారు. ఇందులో రాముడిగా ప్ర‌భాస్‌, జాన‌కిగా కృతిస‌న‌న్ నటిస్తున్నారు. లంకాధిప‌తి రావ‌ణుడిగా బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ క‌నిపించ‌బోతున్నారు. తానాజీ లాంటి విజువల్ వండర్ మూవీని ఇచ్చిన ఓం రౌత్.. ఆదిపురుష్‌తో మరోసారి ఆడియన్స్ కి విజువల్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. మరి ఆదిపురుష్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Exit mobile version