Site icon NTV Telugu

Adipurush: తిరుపతిలో గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్…

Adipurus

Adipurus

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ని శ్రీరాముడిగా చూపిస్తూ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన సినిమా ‘ఆదిపురుష్’. ఇండియాలోనే అత్యధిక బడ్జట్ తో రూపొందిన ఈ మూవీ జూన్ 16న ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అయ్యింది. ఈ ఎపిక్ డ్రామాపై పాన్ ఇండియా ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడంటే ఆదిపురుష్ పై పాజిటివ్ బజ్ ఉంది కానీ టీజర్ రిలీజ్ చేసిన సమయంలో అయితే ఆదిపురుష్ సినిమాపై ఊహించని రేంజులో ట్రోలింగ్ జరిగింది. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో ఆదిపురుష్ భయంకరమైన నెగిటివిటీ ఫేస్ చేసింది. సోషల్ మీడియా అంతా ఆదిపురుష్ సినిమాపైనే ట్రోలింగ్ నడించింది. ఇలాంటి సమయంలో సినిమాని రిలీజ్ చెయ్యకుండా ఓం రౌత్ జనవరి నుంచి జూన్ కి పుష్ చేసి మంచి పని చేసాడు. సరిగ్గా ఆరు నెలల సమయం తీసుకున్న ఓం రౌత్, ఆదిపురుష్ విజువల్ ఎఫెక్ట్స్ లో మార్పులు చేసాడు.

ఒక్కో పోస్టర్ ని వదిలుతూ సినిమాపై హైప్ ని పెంచాడు ఓం రౌత్. ఆ అంచనాలని మరింత పెంచింది జై శ్రీ రామ్ సాంగ్. ఈ ఒక్క పాట ఆదిపురుష్ సినిమా తల రాతనే మార్చేసింది. ఆరు నెలల అజ్ఞాతవాసం తర్వాత రాముడి సినిమా జూన్ 16న బాక్సాఫీస్ ని సొంతం చేసుకోవడానికి రెడీ అయ్యింది. ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ తిరుపతిలో చేస్తున్నట్లు యువీ క్రియేషన్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చింది. జూన్ 6న తిరుపతిలో ఆదిపురుష్ ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగనుంది. ఈ ఈవెంట్ కి అటెండ్ అయ్యే గెస్ట్ లిస్ట్ ఇంకా ఫైనల్ కాలేదు కానీ నాగ్ అశ్విన్, సందీప్ రెడ్డి వంగ, రాజమౌళిలు గెస్టులుగా వచ్చే ఛాన్స్ ఉంది. సినిమా రంగం నుంచే కాదు రాజకీయ నాయకులు కూడా ఆదిపురుష్ ప్రీరిలీజ్ ఈవెంట్ కి అటెండ్ అయ్యే అవకాశం ఉంది. మరి ఆదిపురుష్ సినిమాపై అంచనాలని ఆకాశానికి తీసుకోని వెళ్లబోయే ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ ఎంత గ్రాండ్ గా జరుగుతుందో చూడాలి.

Exit mobile version