ప్రస్తుతం ఎక్కడ చూసిన ఆదిపురుష్ గురించే చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఆదిపురుష్ హవా ఓ రేంజ్‌లో ఉంది. తిరుపతిలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో ప్రభాస్ పేరు ఇండియా అంతా రీసౌండ్ వచ్చేలా వినిపిస్తోంది. ఈవెంట్‌కి భారీగా తరలి వచ్చారు ప్రభాస్ అభిమానుల సందడితో పాటు, జైశ్రీరామ్ నామస్మరణతో పరవశంలో తేలిపోయింది తిరుపతి. ఈ ఈవెంట్ డ్రోన్ షాట్స్ ఒకసారి చూస్తే.. సినిమా ఈవెంట్‌లా కాకుండా ఒక దేవుడి జాతర జరుగుతున్నట్టుగా అనిపించక మానదు. దాదాపు లక్షకు పైగా ప్రభాస్ అభిమానులు హాజరయ్యారు. అందుకు సంబంధించిన డ్రోన్ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఓ పక్క వర్షం పడుతున్నా లెక్క చేయకుండా… ప్రభాస్ కోసం వానర సైన్యంలా నిలబడ్డారు అభిమానులు. ఇక ఈ ఈవెంట్‌లో రిలీజ్ చేసిన ఆదిపురుష్ ఫైనల్ ట్రైలర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. యుద్ధ సన్నివేశాలతో ట్రైలర్ అదిరిపోయిందని అంటున్నారు నెటిజన్స్. ఖచ్చితంగా ఓం రౌత్ పై ప్రభాస్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతాడనే కాన్ఫిడెన్స్ వచ్చిందంటున్నారు.
ఇక సినిమాపై అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్లేలా ఆదిపురుష్ ఆల్బమ్ అద్భుతంగా ఉందనే చెప్పాలి. ఒక్క జై శ్రీరామ్ సాంగ్ ఆదిపురుష్ నెగెటివిటీని పాతాళానికి పడేసింది. ఆ తర్వాత రామ్ సీతా రామ్ సాంగ్ విజువల్స్ వరంగా అదరహో అనిపించుకుంది. ఇక ఇప్పుడు ఫుల్ ఆల్బమ్ రిలీజ్ చేయగా.. మిగతా మూడు సాంగ్స్ అదిరిపోయేలా ఉన్నాయి. శివోహం అనే సాంగ్ గూస్ బంప్స్ తెప్పిస్తుండగా.. ప్రియ మిధునం అనే బ్యూటీఫుల్ మెలోడీ హృదయాలను హత్తుకునేలా ఉంది. మరో సాంగ్ రామునికి సాయం చేసే వానర సైన్యం పై ఉంది. మొత్తంగా మ్యూజిక్ ద్వయం ‘అజయ్-అతుల్’ అందించిన ఆదిపురుష్ ఆల్బమ్‌కు భారీ రెస్పాన్స్ వస్తోంది. మరి ఈ జూన్ 16న ఆదిపురుష్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
