NTV Telugu Site icon

Hanuman: హనుమాన్ చాలీసా.. భక్తి పారవశ్యంలో మునిగిపోయామయ్యా

Hanuman

Hanuman

Hanuman: కుర్ర హీరో తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం హనుమాన్. ప్రైమ్ షో ఎంటర్ టైన్మెంట్ పతాకంపై పి. నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో తేజ సరసన అమ్రితా అయ్యర్ నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్, పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఎండు హనుమాన్ జయంతి సందర్భంగా ఈ చిత్రం నుంచి హనుమాన్ చాలీసా ను రిలీజ్ చేశారు. హనుమాన్ చాలీసా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదొక దైర్యం. బాధలో ఉన్నా.. భయంలో ఉన్నా భయమే లేని హనుమంతుడును తలుచుకొని ఈ హనుమాన్ చాలీసాను చదివితే వెయ్యి ఏనుగుల బలం వస్తుంది. అయితే ఇప్పటివరకు ఈ హనుమాన్ చాలీసా శ్లోక రూపంలో విని ఉంటాం. కానీ.. ఇప్పుడు హనుమాన్ చిత్రంతో అదొక మ్యాజికల్ సాంగ్ రూపంలో వినొచ్చు.

Manchu Mohan Babu: నీకు, నీ భార్యకు సంబంధం ఏంటి.. మీడియాపై మోహన్ బాబు ఎదురుదాడి

ఇక ఈ హనుమాన్ చాలీసా వింటున్నంత సేపు భక్తిపారవశ్యంలో మునిగిపోతారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక విజువల్స్ లో కూడా ప్రశాంత్ వర్మ తన మార్క్ చుపిసిన్హాడు. రాముడు, హనుమంతుడు ఆర్ట్స్ తో అదరగొట్టేశాడు. ఇది విన్నాక సంగీతం అందించిన వారికి, హనుమాన్ చాలీసా పాడిన వారికి దండం పెట్టకుండా ఉండలేం. గౌమ్ర హరి సంగీతం, సాయి చరణ్ భాస్కరుని వాయిస్ వింటుంటే గూస్ బంప్స్ వస్తున్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో ప్రశాంత్ వర్మ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Powerful HANUMAN CHALISA from HanuMan | Prasanth Varma | Teja Sajja, Amritha Aiyer | Primeshow