Site icon NTV Telugu

V V Vinayak: శీనయ్య ఏమైందయ్యా.. మళ్లీ కొత్త సినిమా అంటున్నావ్

Seenayay

Seenayay

V V Vinayak: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోలకు హిట్ల మీద హిట్లు ఇచ్చిన ఈ డైరెక్టర్ ఇటీవల కాలంలో కనిపించింది కూడా లేదు. ఇక ఈ మధ్యనే టాలీవుడ్ హిట్ సినిమా ఛత్రపతిని హిందీలో బెల్లకొండ శ్రీనివాస్ తో తెరకెక్కిస్తున్నా అని చెప్పి షాక్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో బిజీగా వినాయక్.. త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే వినాయక్ హీరోగా శీనయ్య అనే సినిమా సెట్స్ మీదకు వెళ్లి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ అయ్యింది. అయితే మధ్యలో ఏం జరిగిందో తెలియదు కానీ ఈ సినిమాను వినాయక్ పక్కన పెట్టేశాడు. ఇక అనుకోని విధంగా ఈ డైరెక్టర్ మరో సినిమాకు రెడీ అవుతున్నాడట.

ఇక ఈ సినిమాకు డైరెక్టర్, నిర్మాత, హీరో అన్ని వినాయకే అంట. త్వరలోనే ఈ సినిమా టైటిల్ ను రివీల్ చేసి అధికారికంగా ప్రకటించనున్నాడట డైరెక్టర్. మరి శీనయ్య సంగతి ఏంటి అనేది దేవుడికే ఎరుక అంటున్నారు అభిమానులు. మరి ఈ సినిమా కథ ఏంటి..? ఆయన హీరోలా లానే మాస్ క్యారెక్టర్ చేస్తున్నాడా..? లేక ఇంకేదైనా కొత్తగా ప్రయత్నం చేస్తున్నాడా..? అనేది చూడాలి. ఈ విషయం తెలియడంతో నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ఈ వయస్సులో హీరో అవ్వాలనే కోరిక ఎందుకు వచ్చిందో అని కొందరు.. అన్ని నువ్వే చేసేటప్పుడు సినిమా కూడా నువ్వే చూసుకో అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version