Site icon NTV Telugu

వోడ్కా మీద ఒట్టు.. సెక్స్ కన్నా పవన్నే ఎక్కువ ఇష్టపడతా : వర్మ

rgv missing

rgv missing

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కరోనా సమయంలో ‘పవర్ స్టార్’ అనే సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ సినిమానే ‘పవర్ స్టార్/ఆర్జీవీ మిస్సింగ్’ పేరుతో విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని వర్మ ట్విట్టర్ ద్వారా విడుదల చేశాడు. ట్రైలర్ మొత్తం రాజకీయ నాయకుల చుట్టూ తిరగడం మద్యంలో వర్మ కిడ్నాప్ అవ్వడం.. దానివలన జరిగే పరిణామాలు ఏంటి అనేది చూపించాడు. ఒక్క సీటు కూడా రాలేదా అంటూ ప్రవన్ కళ్యాణ్ వాయిస్ తో మొదలైన టీజర్ వర్మ కిడ్నాప్ డ్రామాతో ముగుస్తోంది. ఇందులో పవన్ కళ్యాణ్, చిరంజీవి, కేసీఆర్, చంద్రబాబు, నారా లోకేష్, కెఎ పాల్ నిజ జీవిత పాత్రలను పోలిన వ్యక్తులు కనిపిస్తున్నారు.

రామ్ గోపాల్ వర్మ ఒక్కడే ఒరిజినల్ క్యారక్టర్ ప్లే చేసాడు. ఇక ప్రవం కళ్యాణ్ ఎన్నికల్లో ఓడిపోయాక అతని అన్న ఒమెగా స్టార్ ఓదార్చడం.. మరో రాజకీయ నేత కుట్రలో ప్రవన్ కళ్యాణ్ బలి అయ్యానని చెప్పడం లాంటి పరిణామాలు జరుగుతున్నా వేళ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కిడ్నాప్ అవుతాడు. ఇదంతా వర్మ పబ్లిసిటీ స్టంట్ కోసం చేస్తున్నాడని పోలీసులు లైట్ తీసుకొంటారు. కానీ, అతని కిడ్నాప్ ఎంతోమందికి భయం పుట్టిస్తున్న తరుణంలో సిన్సియర్ పోలీసాఫీసర్ గజినీకాంత్ రంగంలోకి దిగుతాడు. అసలు వర్మను కిడ్నాప్ చేసింది ఎవరు? ఎందుకు చేశారు..? అనేది ట్విస్ట్ గా చూపించారు. కేవీ ప్రొడక్షన్స్ మరియు భీమవరం టాకీస్ బ్యానర్స్ పై కెవి ఛటర్జీ – తుమ్మలపల్లి రామ సత్యనారాయణ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.

Exit mobile version