NTV Telugu Site icon

Pawan Singh: పవర్ స్టార్ పవన్ పై రాళ్ల దాడి.. వీడియో వైరల్

Pawan

Pawan

Pawan Singh: భోజ్ పూరి హీరో, సింగర్ పవర్ స్టార్ పవన్ సింగ్ కు చేదు అనుభవం ఎదురయ్యింది. లైవ్ లో అతడిపై కొంతమంది రాళ్లు విసిరిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే.. భోజ్‌పురి ఇండస్ట్రీ పవర్ స్టార్ గా అక్కడి వారు పిలుచుకునే పవన్ సింగ్ ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లా, నాగ్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యాడు. అక్కడ తన లైవ్ ప్రోగ్రాం ను మొదలుపెట్టాడు. అలా పాట అందుకున్నాడో లేదో జనాల్లో నుంచో ఒక రాయి అతివేగంగా వచ్చి పవన్ ముఖానికి తాకింది. ఆ తరువాత వరుసగా అతడిపై రాళ్లతో దాడి జరిగింది. ఇక ఇది గమనించిన ఈవెంట్ మేనేజర్స్ వెంటనే పవన్ ను అక్కడి నుంచి కిందకు దింపేశారు. అయితే అడిగిన పాట పాడలేదన్న కోపంతో మద్యం తాగిన యువకులు ఈ విధంగా చేసినట్లు చెప్పుకొస్తున్నారు.

ThammaReddy Bharadwaja: ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ కు పెట్టిన ఖర్చుతో నేను 8 సినిమాలు తీసి ముఖాన కొడతా

ఇక ఈ ఘటన పై పవన్ సీరియస్ అయ్యాడు. గుంపులో ఉండి రాళ్లు విసురుతున్నది ఎవరు.. నీకు అంత దమ్ముంటే నా ముందు కొచ్చి విసురు.. నా శత్రువు దాక్కొని ఉండడం నాకు ఇష్టం లేదంటూ చెప్పుకొచ్చాడు. ఇక రాయి తగలడంతో అక్కడ ఉన్నవారందరూ వెళ్లిపోయారు. ప్రస్తుతం పవన్ పరిస్థితి బాగానే ఉందని సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. భోజ్ పూరి ఇండస్ట్రీలో ఈ ఘటన సంచలనంగా మారింది. పవన్ లాంటి స్టార్ హీరోపై రాళ్లు విసిరిన వారు ఎవరైనా ఊరికే వదిలేది లేదని ఆయన ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Show comments