Site icon NTV Telugu

Ustaad Bhagath Singh: 26 నుంచి డేట్స్ ఇచ్చిన పవన్… షూటింగ్ స్టార్ట్ చేయాలి కానీ…

Ustaad Bhagat Singh

Ustaad Bhagat Singh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఏపీలో పొలిటికల్ హీట్ పెరగడంతో పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా టీడీపీతో పొత్తు అనౌన్స్ చేసి అగ్రెసివ్ గా క్యాంపైన్స్ చేస్తున్నాడు. దీంతో జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ డై హార్డ్ ఫ్యాన్స్ మంచి జోష్ లో ఉన్నారు. పొలిటికల్ ప్లాన్స్ వేస్తూనే సినిమా పనులు కూడా చేస్తున్న పవన్ కళ్యాణ్… ఉస్తాద్ భగత్ సినిమా షూటింగ్ కి మళ్లీ డేట్స్ కేటాయించడానికి సమాచారం. గబ్బర్ సింగ్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ డైరెక్టర్ హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అయిన ఈ మూవీ దాదాపు 50% షూటింగ్ కంప్లీట్ అయ్యిందట.

ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షెడ్యూల్ బ్రేక్ లో ఉంది. సెప్టెంబర్ 26 నుంచి పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చాడట. ఇక్కడి నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ లేటెస్ట్ షెడ్యూల్ ని స్టార్ట్ చేయాలనీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇక్కడే ఒక చిక్కొచ్చి పడింది. ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ హీట్ ని బట్టి, రాష్ట్ర రాజకీయ పరిస్థితులను బట్టి పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కి వస్తాడా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. పొలిటికల్ హీట్ కాస్త తక్కువ ఉంటే మాత్రం చెప్పినట్లుగానే సెప్టెంబర్ 26 నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ లేటెస్ట్ షెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. మరి ఫ్యాన్ స్టఫ్ ఇవ్వడంలో ముందుంటున్న ఉస్తాద్ సినిమా ఎప్పుడు షూటింగ్ కంప్లీట్ చేసుకుంటుంది? ఎప్పుడు ఆడియన్స్ ముందుకు వస్తుంది? ఎలాంటి రిజల్ట్ ని సొంతం చేసుకుంటుంది అనేది చూడాలి.

Exit mobile version