పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా వస్తుందంటే.. అభిమానులు ఓ పండగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆయన సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాల్సిందే. టాక్‌తో సంబంధం లేకుండా భారీ ఓపెనింగ్స్ రాబట్టడం ఒక్క పవర్ స్టార్‌కే సాధ్యం. ఒక్క మాటలో చెప్పాలంటే పవర్ స్టార్ దెబ్బకు థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందే. పవన్ ఎంట్రీ, పవర్ ఫుల్ డైలాగ్స్, ఆ మ్యానరిజంకు థియేటర్లో పేపర్లు చిరిగిపోవాల్సిందే. అయితే ఇదంతా తెలుగు ఫ్యాన్స్ వెర్షన్. ఇక ఓవవర్సీస్ ఫ్యాన్స్ వెర్షన్ వేరే లెవల్లో ఉంటుంది. అమెరికాలో పవర్ స్టార్ ఫ్యాన్స్ చేసే రచ్చ మామూలుగా ఉండదు. ప్రస్తుతం బ్రో సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తోంది పవర్ స్టార్ ఆర్మీ. జూలై 28న బ్రో మూవీ థియేటర్లోకి రాబోతోంది. ఇప్పటికే బ్రో ప్రమోషన్ జోరుగా జరుగుతున్నాయి. ఈ రోజు సాయంత్రం జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో బ్రో పై మరింత హైప్ పెరగనుంది.
హైదరాబాద్‌లోని శిల్ప కళా వేదికలో గ్రాండ్‌గా ‘బ్రో’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడి ఫ్యాన్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో సందడి చేస్తుంటే అమెరికా ఫ్యాన్స్ మాత్రం టెస్లా కార్లతో ‘బ్రో’ అంటూ ఓ రేంజ్‌లో రచ్చ చేశారు. అమెరికాలోని డల్లాస్‌లో టెస్లా కార్లను వరుసగా ‘బ్రో’ మూవీ టైటిల్ ఆకారంలో పార్క్ చేసి లైట్ షో చేశారు. దాన్ని డ్రోన్ కెమెరాతో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో వదిలారు. బ్రో టైటిల్ ట్రాక్‌కు టెస్లా కార్ల లైటింగ్, అండ్ డ్యాన్సింగ్ అదిరిపోయింది. దీంతో… ఇది పవర్ స్టార్ క్రేజ్ అంటూ సందడి చేస్తోంది పవన్ ఆర్మీ. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక బ్రో మూవీలో సాయి ధరమ్ తేజ్ కీ రోల్ ప్లే చేస్తుండగా సముద్రఖని డైరెక్ట్ చేశాడు.