Site icon NTV Telugu

OG : పవర్ స్టార్ ‘OG’ కథ.. ఇన్ సైడ్ టాక్ ఇదే.. ఆ సినిమాని పోలి ఉన్నట్టుందిగా?

Og (2)

Og (2)

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ సినిమా ఓజి OG . యంగ్ దర్శకుడు సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళ భామ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నాడు. టాలీవుడ్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను DVV ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మించారు. ఈ రోజు రాత్రి 10 గంటల ప్రీమియర్స్ తో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది OG.

Also Read : Sundarakanda OTT : ఓటీటీ స్ట్రీమింగ్ కొచ్చిన నారా రోహిత్ ‘సుందరకాండ’

కాగా ఈ సినిమా పూర్తి అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమాగా వస్తోంది. ఇక కథ విషయానికి వస్తే ఒకప్పుడు ముంబై మాఫియాను ఏలిన గ్యాంగ్ స్టర్ OG.  ముంబై మొత్తాన్ని తన కనుసైగలతో శాసిస్తాడు. కానీ ఒక బలమైన కారణంగా ఉన్నట్టుండి మాఫీయాను వదిలేసి ఎక్కడో దూరంగా బ్రతుకుతుంతాడట. OG వెళ్ళిపోవండం OMI (ఇమ్రాన్ హష్మీ) మాఫియను తన గుప్పిట్లో పెట్టుకోవాలని, ఆధిపత్యం చెలాయించాలని చూస్తడట. ఈ క్రమంలో OG  ఫ్యామిలీ జోలికి వేల్తాడట OMI. దాంతో అజ్ఞాతం వీడి ఈ సారి తన కొడుకుని, ఫామిలీని రక్షించుకోవడం కోసం ముంబై తిరిగివచ్చిన వచ్చిన ఓజి చేసే విధ్వంసం మాములుగా ఉండదట. ముంబై తిరిగి వచ్చిన ఓజీకి అలాగే  ఓమికిమధ్య జరిగే సంఘర్షణ నెక్ట్స్ లెవల్ లో ఉండబోతుందట. కాస్త అటు ఇటుగా ఈ సినిమా అజిత్ కుమార్ గుడ్ బ్యాడ్ అగ్లీ ని పోలిఉంటుందని టాలీవుడ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్స్ గురించి మాత్రం ఓ రేంజ్ లో చెప్పుకుంటున్నారు. ఓవరాల్ గా OG ఫ్యాన్స్ కు ఓ పండగ లాంటి సినిమా సమాచారం.

Exit mobile version