Site icon NTV Telugu

Power Star: శరవేగంగా ‘హరిహర వీరమల్లు’ షూటింగ్

Hari Hara

Hari Hara

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎపిక్ మాగ్నమ్ ఓపస్ మూవీ ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ అన్నపూర్ణ సెవన్ ఏకర్స్ లో వేసిన సెట్స్ లో జరుగుతోంది. ఇటీవలే ఈ సినిమా కోసం జాతీయ అవార్డు గ్రహీత, పద్మశ్రీ తోట తరణి వేసిన సెట్స్ ను పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా చూసి, ఆయన్ని ఆత్మీయంగా సత్కరించారు. అలానే ఆ సెట్స్ లో చిత్రీకరించే పోరాట సన్నివేశాలకు సంబంధించిన ప్రిపరేషన్ లోనూ పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఇప్పుడు ఆ సన్నివేశాల చిత్రీకరణే జరుగుతోంది. దీనికి సంబంధించిన కొన్ని వర్కింగ్ స్టిల్స్ ను గత కొన్ని రోజులుగా దర్శకుడు క్రిష్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా ఓ సన్నివేశ చిత్రీకరణ అనంతరం పవన్ కళ్యాణ్ కెమెరాకు ఫిట్ చేసిన మానిటర్ లో సీన్ ను వీక్షించే స్టిల్ ను క్రిష్ పెట్టారు.

17వ శ‌తాబ్దం నాటి మొఘ‌లాయిలు, కుతుబ్ షాహీల శకానికి సంబంధించిన కథ కావడంతో ఆనాటి వాతావరణానికి తగ్గట్టుగా పలు సెట్స్ ను రూపొందిస్తున్నారు. సినిమాకు సంబంధించిన అత్యధిక భాగం షూటింగ్ ఈ సెట్స్ లోనే జూలై నెలాఖరు వరకూ జరిగే ఆస్కారం ఉంది. మెగా సూర్యా ప్రొడ‌క్షన్ బ్యాన‌ర్‌పై ఎ. దయాకరరావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆయన సోదరుడు, లెజండ‌రీ ప్రొడ్యూస‌ర్ ఎ. ఎం. ర‌త్నం సమర్పకునిగా వ్యవహరిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ‘హరిహర వీరమల్లు’కు బుర్రా సాయిమాధవ్ సంభాషణలు రాశారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్‌ జోడీగా నిధి అగర్వాల్ నటిస్తోంది. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళం భాష‌ల్లో ఏక కాలంలో విడుద‌ల చేయ‌నున్నారు.

Exit mobile version