NTV Telugu Site icon

Posani krishnamurali: నంది అవార్డులపై పోసాని కీలక ప్రకటన.. ఉత్తములు, అర్హులకు ఇస్తాం!

Posani Announces Nandi Awards

Posani Announces Nandi Awards

Posani Krishnamurali Announcement on Nandi Awards: ఏపీ సచివాలయంలో ఏపీ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి నంది అవార్డులపై కీలక ప్రకటన చేశారు. నిజాయితీగా నంది అవార్డుల ఎంపిక ప్రక్రియ చేయమని ముఖ్యమంత్రి నాకు చెప్పారని పేర్కొన్న ఆయన డ్రామా, టీవీ, సినిమా ఈ మూడు రంగాలకు ఒకేసారి సాధ్యం కాదని చెప్పానని అన్నారు. ఇక ఈ క్రమంలో పద్య నాటకాలకు ఊపిరి పోయాల్సిన అవసరం ఉందని, అందుకే ముందు నాటక రంగానికి నంది అవార్డులు ఇవ్వాలని నిర్ణయించామని అన్నారు.

Sreemukhi: ఓ మైగాడ్ అనిపిస్తున్న శ్రీముఖి అందాలు.. పొట్టి గౌనులో అంతా కనిపించేలా?

పోసాని కృష్ణ మురళి మాట్లాడుతూ నంది అవార్డులు అంటేనే భయం వేస్తోందని, నేను నంది తీసుకుంటే..కమ్మనైనది అవుద్ది అని చెప్పా, ఒక్కొక్కరికి రెండు, మూడు ఇచ్చారని అన్నారు. గతంలో అంబికా కృష్ణని చంద్రబాబు తిట్టారు, అంబికా కృష్ణ తనకి స్వేచ్ఛ ఇవ్వలేదని చంద్రబాబుకి చెప్పేశాడని అన్నారు. మేము నంది అవార్డులను ఉత్తములు, అర్హులకు ఇస్తాం, రాష్ట్రంలో ఎవ్వరు షూటింగ్ లు చేసినా ఉచితంగా చేసుకోవచ్చని, స్టూడియోలు కడితే సహకరిస్తాం అని సీఎం జగన్ చెప్పారని అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తో కూడా సహకారం కోసం మాట్లాడుతానన్న ఆయన రూల్ ప్రకారం, జీవోల ప్రకారం కొన్ని పనులు చేయలేమని, కొన్ని ప్రాక్టికాలిటీతో అవుతాయని అన్నారు.

ఇక ఈ క్రమంలోనే ఐ అండ్ పీఆర్ కమిషనర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ నాటక రంగానికి నంది అవార్డుల నోటిఫికేషన్ విడుదల చేస్తున్నామని, దరఖాస్తు చేసుకోవడానికి నెల రోజుల గడువు ఉంటుందని అన్నారు. ఉప సంహరణకు నెల రోజుల గడువు ఇస్తున్నామన్న ఆయన ఐదు క్యాటగిరీల్లో పోటీలు ఉంటాయని అన్నారు. పద్య, సాంఘిక నాటకాలు, సాంఘిక నాటికలు, పిల్లల నాటకాలు, యువ నాటికలు అన్నీ కలిపి మొత్తం 73 అవార్డులు ఉంటాయని, ప్రాధమికంగా ఎంపిక ప్రక్రియకు నెల రోజుల సమయం పడుతుందని అన్నారు. ప్రాథమిక స్క్రూటినీ లో ఎంపిక అయిన నాటకాలను నిర్దేశిత ప్రాంతంలో ప్రదర్శన చేయాల్సి ఉంటుందని, వారం రోజుల పాటు ఫైనల్ పోటీలు జరుగుతాయని అన్నారు.