Posani Krishna Murali: నేడు టాలీవుడ్ కు బ్లాక్ డే.. మరో లెజెండరీ నటుడిని టాలీవుడ్ కోల్పోయింది. నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ నేడు అనారోగ్యంతో కన్నుమూశారు. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నటుడు, నిర్మాత, ఆంద్రప్రదేశ్ FDC చైర్మన్ పోసాని కృష్ణమురళి తనదైన రీతిలో కైకాలను గుర్తుచేసుకున్నారు.
“చెంచాగిరి చేయకుండా, డ్రామాలు ఆడకుండా నిజాయితీగా బతికినవాడు, నీతిగా ప్రవర్తించినవాడు.. కాలం ఉన్నంతకాలం కాకపోయినా సినీ కళాకారుడు ఉన్నంతకాలం బతికే మహానుభావుడు కైకాల సత్యనారాయణ.. జోహార్” అని తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. పోసాని చెప్పడమనే కాదుకానీ.. కైకాల బతికినంత కాలం నిజాయితీగానే బ్రతికారట.. మనసుకు ఏది అనిపిస్తే అదే చేసేవారట. ఏదిఏమైనా ఇలాంటి లెజెండరీ నటుడిని కోల్పోవడం అనేది టాలీవుడ్ ఇండస్ట్రీకి తీరని లోటే అని ప్రేక్షకులు చెప్పుకొస్తున్నారు.