Kabirlal: పాపులర్ సినిమాటోగ్రాఫర్ ‘దివ్యదృష్టి’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్‌లో ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని లీడింగ్ సినిమాటోగ్రాఫర్ కబీర్‌లాల్. రీసెంట్‌గా మరాఠీలో ‘అదృశ్య’ అనే సినిమాతో మరింత పాపులర్ అయ్యారు. ‘అదృశ్య’కి క్రిటిక్స్ ప్రశంసలు, ఆడియన్స్ సపోర్ట్ దక్కాయి. నార్త్ లో గొప్ప పేరు తెచ్చుకున్న కబీర్‌లాల్ ఇప్పుడు సౌత్ ఇండియాలో, మన తెలుగులో సినిమాలు చేయడానికి నడుం బిగించారు. లవ్లీ వరల్డ్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ బేస్డ్ నావల్ కాన్సెప్ట్ తో ‘దివ్యదృష్టి’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు కబీర్‌లాల్. ఈషా చావ్లా ఇందులో లీడ్ రోల్ చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన పనులన్నీ దాదాపుగా పూర్తి కావచ్చాయి. త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Also Read
- OTT Releases: ఈ వారం ఓటీటీ సినిమాలు… థ్రిల్లర్, కామెడీ, హారర్‌తో సరికొత్త లైనప్
- Prabhas : మలయాళం ఊచకోత డైరెక్టర్ తో ప్రభాస్?
- Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10లోకి ఎంట్రీ ఇచ్చే 10 మంది వీళ్లే ?.. లిస్ట్ ఇదిగో!
- NTV Exclusive: ‘మండాడి’ కోసం 45 రోజులు సముద్రంలోనే.. నాలుగైదుసార్లు చావు అంచుల వరకు వెళ్లాం: సుహాస్

తన సోదరి హత్యకు కారణమైన వారిని వెతికి కనిపెట్టాలనుకునుకునే కంటిచూపులేని అమ్మాయి కథే ‘దివ్యదృష్టి’. హంతకులను వెతకడానికి ఆమె చేసిన కృషి, తదనంతర పరిస్థితులు కీలకంగా సినిమా సాగుతుంది. గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో ఈ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌ని రూపొందిస్తున్నారు. కమల్ కామరాజు ఈ చిత్రంలో బిజినెస్‌మేన్‌గా నటిస్తున్నారు. ఈషా చావ్లా చేస్తున్న దివ్య కేరక్టర్‌కి హజ్‌బెండ్‌గా కనిపిస్తారు కమల్. నిళల్‌గళ్ రవి, తులసి కీలక పాత్రలు చేస్తున్న ఈ చిత్రంలో నిర్మాత అజయ్‌కుమార్ సింగ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ రోల్ ప్లే చేశారు. భారతీయ భాషల్లో 100కి పైగా సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన కబీర్‌లాల్ ఈ సినిమాతో తెలుగులో దర్శకుడిగా పరిచయమవుతుండటం విశేషం. తాము అనౌన్స్ చేసిన పేర్లు మాత్రమే కాక, సినిమా రిలీజ్ అయ్యాక నటీనటుల్లో ఓ వ్యక్తిని చూసి సర్‌ప్రైజ్ ఫీలవడం ఆడియన్స్ వంతు అవుతుందని నిర్మాత అజయ్ కుమార్ సింగ్ చెబుతున్నారు. ఈ చిత్రానికి షాహిద్ లాల్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తుండగా అచ్చు రాజామణి నేపథ్యం సంగీతం అందిస్తున్నారు. ఇ. గౌరీశంకర్ మాటలు సమకూర్చుతున్నారు.
తాజావార్తలు
-
OTT Releases: ఈ వారం ఓటీటీ సినిమాలు… థ్రిల్లర్, కామెడీ, హారర్‌తో సరికొత్త లైనప్
-
Joe Root: నాకు ఆడడం రాదా?.. 14 వేల పరుగులు ఎలా చేశాను.. విమర్శకులకు జో రూట్ గట్టి కౌంటర్!
-
Lenskart Investorsకు గుడ్ న్యూస్.. షేర్లో 40% అప్‌సైడ్ ఉందంటున్న నోమురా!
-
Psychology Facts: ‘లైట్ తీసుకో, పట్టించుకోకు..’ ఈ మాటలతో నష్టమే ఎక్కువ!
-
Prabhas : మలయాళం ఊచకోత డైరెక్టర్ తో ప్రభాస్?
ట్రెండింగ్
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!