Site icon NTV Telugu

Poorana : హీరోయిన్ విడాకుల రూమర్స్‌కు.. చెక్ పెట్టిన భర్త

Poorna

Poorna

ఇటీవల కాలంలో ఇండస్ట్రీలో విడాకుల వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. వీరికి సంబంధించిన ఏ చిన్న పోస్ట్ అయినా పెద్ద హంగామాకే దారితీస్తుంది. పెళ్లి, విడాకులు, సంబంధాలపై వచ్చే రూమర్స్ అభిమానులను మాత్రమే కాదు, మీడియాను కూడా ఆకర్షిస్తాయి. తాజాగా అలాంటి వార్తల్లో పూర్ణ (షమ్నా కాసిం) పేరు హాట్ టాపిక్‌గా మారింది.

Also Read : Bigg Boss 9: లాంచ్ డేట్ ఫిక్స్.. ఈ సారి డబుల్ హౌస్, డబుల్ డోస్

2022లో దుబాయ్ వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీని తో పూర్ణ  వివాహం కన్నుల పండుగా జరిగిన విషయం తెలిసిందే. వీరికి ఓ మగబిడ్డ కూడా జన్మించారు. ఆ తర్వాత కొంత కాలం సినిమాలకు దూరంగా ఉన్న ఆమె, ఇప్పుడు తిరిగి రీ ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల మహేష్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ సినిమాలో స్పెషల్ సాంగ్ ద్వారా ప్రేక్షకులను అలరించారు. అయితే రీసెంట్‌గా పూర్ణ భర్త షానిద్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్టు ఒక్కసారిగా వైరల్ అయ్యింది.

ఆయన.. ‘నా జీవితంలో ఈ 45 రోజులు మరచిపోలేని రోజులు. ఒంటరితనాన్ని భరించలేకపోయాను. నీ జ్ఞాపకాలతోనే రాత్రులు గడపాల్సి వచ్చింది. మనల్ని ప్రేమించే వారు మనతో ఉండడమే జీవితంలో గొప్ప వరం. ఈ రోజు నా భార్య తిరిగి నా దగ్గరకు వచ్చేసింది’ అంటూ ఓ భావోద్వేగ పోస్ట్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు, అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.. ఇద్దరి మధ్య ఏదైనా సమస్య జరిగింది?,వారు విడిపోతున్నారా? అని అనుమానాలు వ్యక్తం చేశారు. మీడియా కూడా ఈ వార్తను హైలైట్ చేయడంతో పుకార్లు మరింత వేగంగా వ్యాప్తి చెందాయి. దీంతో క్లారిటీ వెంటనే ఇచ్చిన భర్త.. ఈ పోస్ట్ వెనుక ఉన్న అసలు కారణాన్ని వివరించారు.. ‘నా భార్య 45 రోజులు నన్ను దూరంగా ఉంది. పెళ్లి అయిన తర్వాత ఇంతకాలం ఎప్పుడూ దూరంగా లేం. అందుకే ఎమోషనల్‌గా ఆ పోస్ట్ రాసాను. దయచేసి దాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు. మేము దేవుడి దయతో సంతోషంగానే ఉన్నాం’ అని క్లారిటీ ఇచ్చారు. మొత్తనికి ఈ న్యూస్ వైరల్ అవుతుంది.

Exit mobile version