Poonam Pandey Shares Cryptic Post on Death News: బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హాట్ అండ్ బోల్డ్ నటి పూనమ్ పాండే కొంత కాలంగా నిరంతరం వార్తల్లో నిలుస్తోంది. ఆమె గర్భాశయ క్యాన్సర్ తో మరణించినట్టు ప్రచారం జరగగా అది నిజం అనుకుని పెద్ద దుమారమే రేగింది. అభిమానులే కాకుండా చాలా మంది ప్రముఖ సెలబ్రిటీలు కూడా ఆమెని చాలా విమర్శించారు. వాస్తవానికి, పూనమ్ పాండే గర్భాశయ క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడానికి తన స్వంత మరణ పుకారును వ్యాప్తి చేసింది. అయితే పూనమ్ పాండే ఆడిన ఈ గేమ్ ఆమెకు భారీగానే ముట్టినట్టు చెబుతున్నారు.
Nawaz Sharif: నవాజ్ షరీఫ్ స్కెచ్ మామూలుగా లేదు కదా?
ఇక ఈ దెబ్బతో మా మనోభావాలు దెబ్బతిన్నాయి అని ఆమెపై రూ.100 కోట్ల పరువు నష్టం కేసు నమోదైంది. ఇక ఇదిలా ఉండగా, మరోసారి పూనమ్ పాండే సోషల్ మీడియాలో అలాంటి పోస్ట్‌ను షేర్ చేసింది. దీన్ని చూసి నెటిజన్లు ఇప్పుడు దయచేసి ఇకపై డ్రామా సృష్టించవద్దు అని నేరుగా కామెంట్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు పూనమ్ పాండే శనివారం తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో ఒక పోస్ట్‌ను షేర్ చేశారు. అందులో “నిజం త్వరలో బయటకు వస్తుంది” అని రాశారు. పూనమ్ పాండే సోషల్ మీడియాలో ఇలాంటి పోస్ట్ ఎందుకు షేర్ చేసిందో అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే అని అంటున్నారు. ఇక ఇప్పుడు పూనమ్ పాండే పోస్ట్‌ను ఎగతాళి చేస్తూ యూజర్లు ఆమెను ట్రోల్ చేయడం ప్రారంభించారు. మీ ఉద్దేశం ఏమిటో కింద కామెంట్ చేయండి.
