Site icon NTV Telugu

Poonam Pandey: నన్ను కుక్కను కొట్టినట్లు కొట్టి.. గదిలో బంధించాడు

Poonam Pandey

Poonam Pandey

బాలీవుడ్ హాట్ బ్యూటీ పూనమ్ పాండే గురించి రోజుకో వార్త బయటికి వస్తుంది. వ్యాపారవేత్త శ్యామ్ బాంబే ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ భామ కేవలం నెలరోజులు కూడా గడవకముందే భర్తపై అత్యాచార కేసు పెట్టి జైలుకు పంపింది. వివాదాలతోనే జీవితాన్ని కొనసాగిస్తున్న ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న లాకప్ షో లో కంటెస్టెంట్ గా వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక ఈ షో లో అమ్మడు తన కాపురంలో తాను పడిన బాధలను, కష్టాలను ఏకరువు పెట్టింది. మొన్నటికి మొన్న భర్త తనను ఎంత హింసించాడో చెప్పి ఎమోషనల్ అయిన పూనమ్.. మరోసారి ఆ నరకాన్ని గుర్తుచేసుకుంది.

” ఈ లాకప్ షో లో నాకు అన్ని దొరుకుతున్నాయి.. మంచి ఫుడ్, బెడ్, నిద్ర.. శ్యామ్ తో కలిసి ఉన్నప్పుడు ఆ ఇల్లు నాకు నరకంలా అనిపించేది. నాలుగేళ్లు సరిగ్గా తిన్నది లేదు.. కంటి నిండా నిద్ర లేదు.. రోజు తిట్టడం.. కుక్కను కొట్టినట్లు కొట్టడం.. ఒక రూమ్ లో బంధించడం.. ఇదే జరుగుతూ ఉండేది.కనీసం తినడానికి వడాపావ్ అయినా దొరికితే చాలు అనుకునేదాన్ని.. ఎవరికైనా ఫోన్ చేసి చెప్పాలంటే ఫోన్ నా చేతిలో ఉంచేవాడు కాదు.. ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి.. ఈ నరకాన్ని భరించలేక చాలాసార్లు ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాను” అంటూ కన్నీటి పర్యంతమయ్యింది. మరి ఈసారి అమ్మడి వ్యాఖ్యలకు మాజీ భర్త శ్యామ్ బాంబే ఎలా స్పందిస్తాడో చూడాలి.

Exit mobile version