NTV Telugu Site icon

Poonam Pandey : పూనమ్ పాండేకి షాక్.. అది కావాలని అడిగిన చిన్నారి!

Poonam Pandey

Poonam Pandey

Poonam Pandey Got Shocked When Kid Asked For Her Instagram ID: కంగనా రనౌత్ హోస్ట్ చేసిన రియాలిటీ టీవీ షో ‘లాకప్’లో భాగమైన బోల్డ్ నటి పూనమ్ పాండే తన బోల్డ్ స్టైల్ కారణంగా హెడ్‌లైన్స్‌లోకి వస్తూనే ఉంటుంది. రీసెంట్ గా పూనమ్ పాండే తన అభిమానులను కలిసినప్పుడు దగ్గర్లో క్రికెట్ ఆడుతున్న కొందరు పిల్లలు ఆమెను కలవడానికి వచ్చారు. పిల్లలు పూనమ్ పాండేతో కరచాలనం చేసేందుకు ప్రయత్నం చేశారు. ఆపై ఒక పిల్లవాడు పూనమ్‌ను ఒక షాకింగ్ ప్రశ్న అడిగాడు. దానికి నటి పగలబడి నవ్వింది. పూనమ్ పాండే నేటి పిల్లలు ఎలా ఉన్నారో చూశారా అని చెప్పడం వీడియోలో కనిపిస్తోంది. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. పూనమ్ పాండే తన అభిమాని ఒకరు వేసిన స్కెచ్‌ను తీసుకొని వెళ్తూ పక్కనే ఉన్న పిల్లలతో మాట్లాడింది.

Nayanthara: ఆటోలో నయనతార కొడుకులు.. వీడియో వైరల్!

కరచాలనం చేసిన తర్వాత ఓ చిన్నారి పూనమ్ పాండేని “మీ ఇన్‌స్టాగ్రామ్ ఐడి ఏమిటి?” అని అడిగాడు. దానికి పూనమ్ పాండే పగలబడి నవ్వుతూ.. ‘నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ తీసుకుని ఏం చేస్తావో చెప్పు.. మమ్మీ అంటే భయం లేదా, మీ మమ్మీ చంపేస్తుంది..’ అంటూ చిన్నారితో చెప్పింది. పూనమ్ పాండే మాట్లాడుతూ- చూడండి, అతను పూనమ్ పాండే ఐడిని అడుగుతున్నాడు. చిన్నారితో పూనమ్ మాట్లాడుతూ- మీకు ఇన్‌స్టాగ్రామ్ ఐడి ఉందా? నేను నీకు నిన్ను డిఎమ్ చేస్తానని పేర్కొంది. ఇక గర్భాశయ క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడానికి పూనమ్ పాండే ఇటీవల తన మరణాన్ని ఫేక్ చేసి విమర్శలు ఎదుర్కొంది. నిజానికి అలా చేయడం వలన ఆమె సోషల్ మీడియాలో చాలా విమర్శలు ఎదుర్కొంది. అయితే ఎట్టకేలకు సోషల్ మీడియాలోకి వచ్చి తాను బతికే ఉన్నానని చెప్పింది.

Show comments