NTV Telugu Site icon

Poonam Kaur: ‘పవర్ రేపిస్ట్’.. కలకలం రేపుతున్న పూనమ్ కౌర్ ట్వీట్

Poonam

Poonam

Poonam Kaur Stating Power Rapist Tweet goes Viral: చేసిన సినిమాల కంటే వివాదాస్పద వ్యాఖ్యలు ట్వీట్లతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది పూనం కౌర్. తాజాగా ఆమె చేసిన ఒక ట్వీట్ హాట్ టాపిక్ అవుతోంది. నిజానికి పూర్తిగా సినిమాలకు దూరమైన ఆమె ఎక్కువగా సోషల్ యాక్టివిస్ట్ గా వ్యవహరిస్తూ అనేక అంశాల మీద స్పందిస్తూ వస్తోంది. చేనేత వస్త్రాలను ప్రమోట్ చేస్తున్న ఆమె అనేక ప్రాంతాల్లో పర్యటిస్తూ వస్తోంది. ఇక తాజాగా జరిగిన ఏపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వ్యవహారం మీద ఆమె సంచలన ట్వీట్ చేసింది. తన భార్య మీద అత్యాచారం చేసిన ఎమ్మెల్యే వ్యవహారాన్ని బట్టబయలు చేసేలా ఎంకరేజ్ చేసిన ఆ భర్తకు కృతజ్ఞతలు. అతను కనుక అలా చేయకుండా ఉండుంటే అతను టిడిపి నుంచి సస్పెండ్ అయ్యేవాడు కాదు. ఎంతోమంది అతను పవర్ లో ఉన్నాడు కాబట్టి సైలెంట్ గా ఉండమని చెప్పి ఉండవచ్చు కానీ అతను తన భార్యకు అండగా నిలబడ్డాడు.

GOAT: విజయ్ రెమ్యునరేషన్ తో 40 చిన్న సినిమాలు తీయచ్చు తెలుసా?:

అలాగే ఎవరైతే మహిళ అత్యాచారానికి గురై ఈరోజు బయటికి వచ్చి మాట్లాడిందో ఆమెకు కూడా కూడోస్ అంటూ ఆమె రాసుకొచ్చింది. ఇక పూనం కౌర్ పవర్ రేపిస్ట్ అనే పదం వాడడంతో అనేక చర్చలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ కి చెందిన తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యేగా కోనేటి ఆదిమూలం వ్యవహరిస్తున్నారు. గతంలో వైసిపి ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరి బి ఫామ్ పుచ్చుకున్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో టిడిపి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రస్తుతం సత్యవేడు ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. అదే సత్యవేడు నియోజకవర్గానికి చెందిన తెలుగు మహిళా అధ్యక్షురాలు వరలక్ష్మి కోనేటి ఆదిమూలం తనను లైంగికంగా వేధించాడని రెండుసార్లు అత్యాచారం కూడా చేశారని చెబుతూ మీడియా ముందుకు వచ్చింది. అదే విషయం మీద ఇప్పుడు పూనం ట్వీట్ చేసింది.