అందం, అభినయం ఉన్న ఈ బ్యూటీ పూనమ్ కౌర్ కు ప్రస్తుతం ఆఫర్లు కరువయ్యాయని చెప్పొచ్చు. అయితే ఈ బ్యూటీ కొంతమంది టాలీవుడ్ ప్రముఖులపై తరచుగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంది. తన తాజా ఇంటరాక్షన్‌లో పూనమ్ కౌర్ చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి ఇటీవలి కాలంలో తాను భరించాల్సి వచ్చిన వ్యక్తిగత అవమానాలు, తగిలిన గాయం గురించి ఓపెన్ అవుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది. తన తాజా చిత్రం “నాతిచరామి” ఓటిటిలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆమె ఈ ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
Read Also : Salaar : అతిథి పాత్రలో మరో స్టార్… రివీల్ చేసిన ప్రభాస్
“నేను ఇటీవల మానసికంగా, కెరీర్‌కు సంబంధించిన నష్టాన్ని చాలా చవి చూశాను. కొంతమంది నా కెరీర్‌ను నాశనం చేయడానికి ప్రయత్నించారు. కానీ నేను గట్టిగా నిలబడ్డాను. ఈ ప్రభావవంతమైన వ్యక్తులు నాకు పెద్ద సినిమా అవకాశాలను లేకుండా చేశారు. వారు స్వార్థ ప్రయోజనాల కోసమే ఇలా చేశారు. అయినా వెనక్కి తగ్గకుండా మళ్ళీ చిత్రపరిశ్రమలో ప్రయాణాన్ని మొదలు పెట్టాను. ఎందుకిలా చేస్తున్నారని బాధ పడ్డాను. కానీ నన్ను అబ్యూజ్ చెయ్యలేదు వారు… వేరే వాళ్ళని చేయడానికి నన్ను ఉపయోగించుకున్నారు. దాన్ని నేను ఆపలేను” అని పూనమ్ తెలిపారు. ఆమె ఇంకా మాట్లాడుతూ ఈ ప్రభావవంతమైన వ్యక్తులు తనను ఎంతగానో దెబ్బతీశారని, తాను పెళ్లి కూడా చేసుకోలేకపోయానని, అమెరికాకు వెళ్లకుండా భారత్‌లోనే ఉండాల్సి వచ్చిందని పూనమ్ వెల్లడించింది. అయితే ఆ పెద్దలు ఎవరని ఆమె పేర్లు మాత్రం చెప్పలేదు. కానీ ఆమె ఎవరిపై కామెంట్స్ చేసిందో తెలుసంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
