Site icon NTV Telugu

Poonam kaur: పవన్ ‘జల్సా’తో కథ అల్లారు.. ఎట్టకేలకు ఓపెన్ అయిపోయిన పూనమ్ కౌర్

Poonam Kaur Slams Trivikram

Poonam Kaur Slams Trivikram

Poonam kaur Reveals Back Story of Jalsa Movie Allegations on Trivikram: తెలుగులో చేసిన సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా ఉంటుంది నటి పూనమ్ కౌర్. తెలుగులో అనేక సినిమాలో హీరోయిన్ గా నటించి కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించిన పంజాబీ భామ పూనమ్ కౌర్ గత కొన్నేళ్లుగా సోషల్ మీడియా వేదికగా సంచలన ఆరోపణలకు కేంద్ర బిందువుగా మారుతుంది. ముఖ్యంగా త్రివిక్రమ్ మీద పవన్ కళ్యాణ్ మీద ఆమె పరోక్షంగా చేసే వ్యాఖ్యలు ఎప్పటికప్పుడు హైలైట్ అవుతూ ఉంటాయి. అయితే గతంలో ఆమెను జల్సా సినిమాలో నటించాల్సి ఉండగా తప్పించి ఆమె స్థానంలో పార్వతి మెల్టన్ ను నటింప చేశారు అనే టాక్ ఉంది. దానికి కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్ కాబట్టి ఆయనను అప్పటి నుంచి ఆమె టార్గెట్ చేస్తూ ఉంటుందని సోషల్ మీడియాలో ఒక టాక్ నడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఆమె నిజంగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ ను పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తూ ఉండటంతో అసలు ఏం జరిగిందో తెలియకుండానే వారి మధ్య వివాహం కూడా పెరుగుతూ వచ్చింది. అయితే తాజాగా ఈ విషయం మీద పూనమ్ కౌర్ స్పందించింది.

Rashmika Mandanna: దివి కోసమే ఆ పని చేసానంటున్న రష్మిక.. గ్రేట్ కదా..

అసలు విషయం ఏమిటంటే తాజాగా ఏపీకి చెందిన గీతాంజలి అనే మహిళ ఆత్మహత్య చేసుకునే మరణించింది ఆమె గురించి ట్వీట్ చేసిన పూనమ్ కౌర్ గీతాంజలి ఎవరి వల్ల ఆత్మహత్య చేసుకుంది? అనే విషయం మీద తనకు కన్ఫ్యూజన్ ఉందని చెప్పుకొచ్చింది. ఎవరైతే ఒక పార్టీకి చెందిన ఆన్లైన్ ట్రోలర్స్ ముఠా ఉందో, ఎప్పుడూ వాళ్ళు మహిళలను సైకలాజికల్ గా ఇబ్బంది పెట్టే విధంగా ట్రోల్ చేస్తూ ఉంటారో వాళ్లు కానీ లేక వారు ఎవరైనా కానీ వాళ్లని శిక్షించాలని కోరింది. ఆ తర్వాత ఎందుకు చెప్పుకొచ్చిందో తెలియదు కానీ జల్సా స్టోరీ అనేది తన మీద వండి వార్చిన ఒక ఫేక్ స్టోరీ అని చెప్పుకొచ్చింది. నిజాన్ని కప్పిపుచ్చే విధంగా ఈ ఫేక్ స్టోరీ అల్లారని తాను తన జీవితకాలంలో ఏ ఒక్క డైరెక్టర్ ని గాని నటుడిని గాని ఒక సినిమా కోసం అవకాశం అడగలేదు అని చెప్పుకొచ్చింది. తాను ఎప్పుడూ నటన లేకుండా అయినా ఎలా బతకవచ్చు అనే విషయం మీద ఆలోచిస్తూ ఉంటా అని చెప్పుకు రావడమే కాదు తాను ఒప్పుకున్న సినిమాలు, చేసిన సినిమాలు కంటే రిజెక్ట్ చేసిన సినిమాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ విషయాన్ని నమ్మవద్దని అని చెప్పుకొచ్చింది. అయితే గీతాంజలి అంశాన్ని ప్రస్తావిస్తూ ఆమె ఈ జల్సా విషయాన్ని ఎందుకు ఇప్పుడు తెరమీదకు తీసుకొచ్చింది అనే అంశం మీద చర్చలు జరుగుతున్నాయి.

Exit mobile version