Site icon NTV Telugu

Poonam Kaur : కాంగ్రెస్ ఎంపీని కలిసిన హీరోయిన్… పిక్స్ వైరల్

Poonam Kaur

Poonam Kaur

ఏపీలో చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ తనదైన రీతిలో చేనేత వస్త్రాలను ప్రోత్సహిస్తోంది. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం ఆమె కొంతమంది లా విద్యార్థులతో కలిసి కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో చేనేతకు సంబంధించిన ఆసక్తికర విషయాలను చర్చించారు. ఇక పూనమ్ కౌర్ తో పాటు పలువురు విద్యార్థులను కలవడం ఆనందంగా ఉందంటూ శశి థరూర్ భేటీకి సంబంధించిన కొన్ని ఫోటోలను ట్వీట్ చేశారు. “చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ తొలగించాలని డిమాండ్ చేస్తున్న న్యాయ విద్యార్థుల బృందాన్ని, పూనమ్‌ కౌర్‌ను కలవడం సంతోషంగా ఉంది. వారి డిమాండ్‌కు నేను సపోర్ట్ చేస్తున్నాను. పరిశ్రమ సంక్షోభంలో ఉంది. చేనేత కార్మికులు చాలా కష్టపడతారు. పైగా జీఎస్టీ వల్ల ఖర్చు పెరిగి వారిపై అదనపు భారం పడుతోంది” అంటూ శశి థరూర్ ట్వీట్ చేశారు.

Read Also : Krishna Vrinda Vihari : “వెన్నెల్లో వర్షంలా”… రొమాంటిక్ సాంగ్ రిలీజ్ చేసిన సామ్ 

ఇక పూనమ్ కౌర్ కూడా శశి థరూర్‌ తమకు సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు తెలిపింది. గతంలో కూడా పూనమ్‌ కష్టాల వల్ల ఆత్మహత్యలకు పాల్పడుతున్న చేనేత కార్మికులకు అండగా ఉండాలని, జీఎస్‌టీని పూర్తిగా ఎత్తివేయాలని ప్రధానిని కోరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తన డిమాండ్ కు ప్రముఖుల నుంచి సపోర్ట్ ను అందుకునే పనిలో పడింది ఈ బ్యూటీ.

Exit mobile version